
Spices: తీరికలేకుండా కష్డపడుతున్నా కొందరికి దురదృష్టమే వెంటాడుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా నెగెటివ్ వాతావరణమే ఉంటుంది. ఇలాంటప్పుడు కొందరు ఎవరెవరినో సంప్రదించి తమకు మంచి మార్గం చూపించాలని కోరుతారు. ఈ క్రమంలో అనవసరంగా డబ్బును వృథా చేసుకుంటారు. అయితే వాస్తు శాస్త్రంప్రకారం మనకు అందుబాటులో ఉండే వస్తువులతోనే మనం అదృష్టాన్ని తెచ్చుకోవచ్చని అంటున్నారు. ముఖ్యంగా ఇంట్లో ఉండే వంట పదార్థాలను ఉపయోగించిన పాజిటివ్ ఎనర్జీని కల్పించుకోవచ్చని తెలుపుతున్నారు. మరి ఆ పదార్థాలేవో చూద్దాం..
మన ఇంట్లోని వంటగదిలో ఎన్నో పదార్థాలు ఉంటాయి. వీటిలో మసాలా దినుసులు మరీ ప్రత్యేకమైనవి. ముఖ్యమైన ఆహార పదార్థాలు వండినప్పుడు మసాలా దినుసులను ఉపయోగిస్తాం. కానీ వీటితో అదృష్టవంతులు కూడా అవుతారని వాస్తు శాస్త్రం చెబుతోంది. వీటిని ఉపయోగించడం వల్ల మనతో పాటు మన చట్టుపక్కల ఉన్నవారు కూడా అభివృద్ధి చెందుతారని ఈ శాస్త్ర ప్రకారం తెలుస్తోంది.
సోంపు, లవంగం:
సోంపు లవంగంలు అనుకూల వాతావరణాన్ని కలిగిస్తాయి. సోంపును మంచి స్మెల్ రావడానికి నోట్లో వేసుకుంటాం. అదే లవంగంతో కలిపి వేసుకోవడం వల్ల ఆరోగ్యకరం. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి కూడా ఉంటుందని కొందరు పేర్కొంటున్నారు. ఇక సోంపు లేదా లవంగంను ఇంటి గుమ్మానికి కట్టడం ద్వారా ప్రతికూల వాతావరణం నుంచి కాపాడుతుంది. అలాగే సోంపును తలదిండు కింద పెట్టుకుంటే మంచి నిద్ర పడుతుందట. మన పర్సులో లవంగం ఉండడం వల్ల మంచి వాతావరణం ఏర్పడుతుందట. ఇక లక్ష్మీదేవికి ఎర్రగులాబీలతో పాటు లవంగాలు కలిపి పూజ చేయడం వల్ల డబ్బు, అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు.
గరం మసాలా:
గరం మసాలాకు ప్రత్యేక వంటకాల్లో ఉపయోగిస్తారని తెలుసు. ఇది వేసుకోవడం వల్ల కూర రుచిగా మారుతుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం గరం మసాలా పౌడర్ విజయాన్ని ఆకర్షించడంలో ఉపయోగపడుతుందట. గరం మసాలా ప్యాకెట్ మన జేబులో ఉండడం వల్ల అదృష్టం వరిస్తుందట. లేదా గరం మసాలా పొడిని ఇంట్లో మూలన చల్లుకోవడం ద్వారా ఆదాయం పెరుగుతుందట. ఇక దాల్చిన చెక్క జేబులో ఉంచుకోవడం వల్ల ప్రేమ, విజయంతో పాటు ఆరోగ్యం దక్కుతుందని వాస్తు శాస్త్రం తెలుపుతుంది.
పూదీన:
పూదీన మంచి సువాసను ఇస్తుంది. పూదీనాను కూడా మన జేబులో ఉంచుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఆకుల నుంచి వచ్చే వాసనతో శరీరంలో ఎనర్జీ పెరుగతుంది. వీటితో పాటు నల్లమిరియాలు, యాలకులు తినడం తినడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుందని వాస్తు శాస్త్ర నిపునులు చెబుతున్నారు.