
Mahesh Babu- Vennela Kishore: సినీ నటుల కోసం షూటింగ్ సమయంలో క్యారీ వ్యాన్ ను ఏర్పాటు చేస్తారు. ఒకప్పుడు హీరో, హీరోయిన్ కు మాత్రమే ఈ క్యార్ వాన్ లు ఉండేవి. కానీ ఇప్పుడ సీనియర్ నటులు సైతం తమకు క్యారీ వ్యాన్ సౌకర్యం కావాలని అడుగుతున్నట్లు ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు కు సొంతంగా క్యారీ వ్యాన్ ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ క్యారీ వ్యాన్ ను దాదాపుగా ఇతరులు చూసి ఉండరు. కానీ కమెడియన్ వెన్నెల కిశోర్ ఆయన క్యారీ వ్యాన్ లోకి వెళ్లాడు. అక్కడున్న ఐటమ్స్ చూసి షాక్ అయ్యాడు. ఇంతకీ అక్కడ ఏమేం ఉన్నాయి?
మహేష్ బాబు క్యారీ వ్యాన్ దగ్గరికి వెళ్లి అటూ ఇటూ చూసి మెల్లిగా డోర్ ఓపెన్ చేస్తాడు. ముందుగా డ్రెస్సింగ్ టేబుల్ వద్దకు వెళ్తాడు. అక్కుడన్న గ్లాసెస్ చూసి షాక్ అవుతాడు. రకరకాల గ్లాసెస్ మూడు సెట్లు ఉన్నాయి అక్కడ. అందులో ఒకదానిని పెట్టుకొని చూస్తాడు. ఇక ఆ తరువాత క్యారీ వ్యాన్ లోనే కిచెన్ చూసి ఆశ్చర్యపోతాడు. అన్నీ క్యారీ వ్యాన్ లోనే ఉండడంతో ఇక బయటకు ఎందుకు వస్తారని అంటారు. ఆ తరువాత సోఫాలో కూర్చుని ఓ బ్యాగ్ ను చూసి ‘ఏం జీవితంరా బాబు’ అని అంటారు.
ఇక అప్పుడే డోర్ సౌండ్ వస్తుంది. అయితే ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడానికి సోఫాలో పడుకుని బెడ్ షీట్ కప్పుకుంటాడు. ఓ బాయ్ వచ్చి ఓ వాటర్ బాటిల్ అక్కడ పెట్టి వెళ్తాడు. ఇంత అందమైన జీవితం ఎవరికి ఉంటుంది? అని అనుకుంటాడు. ఇక ఆ తరువాత మరోసారి డోర్ సౌండ్.. ఇంతలో ఇద్దరు వ్యక్తులు మహేష్ బాబు ఫొటో మాస్క్ పెట్టుకొని లోపలికి వస్తారు. ఆ తరువాత వెన్నెల కిశోర్ ను కిడ్నాప్ చేస్తారు.

వాస్తవానికి ఆయన బెడ్ షీట్ కప్పుకొని ఉండడం వల్ల మహేష్ అని అనుకొని ఆయనను ఎత్తుకెళ్తారు. ఆ తరువాత వెన్నెల కిశోర్ అని తెలుసుకునేసరికి నీరుగార్చుతారు. ఇదంతో ఓ మూవీలోని క్లిప్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ కామెడీ వీడియోను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి..