https://oktelugu.com/

Mallareddy – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు విలన్ గా మారాలన్నారు.. కానీ..: మల్లారెడ్డి కామెంట్స్

Mallareddy – Pawan Kalyan : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఈ మధ్య ట్రెండీగా మారారు. కొన్ని నెలలుగా రాజకీయంగా ఆయన చేసే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా సినీ ఇండస్ట్రీపై బాంబ్ పేల్చారు. ఏ కార్యక్రమానికి వెళ్లినా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేతత్వం మల్లారెడ్డిది. అందుకే ఆయన ప్రసంగంపై అందరికీ ఆసక్తి ఉంటుంది. తాజాగా మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ సినిమాలో తనను విలన్ గా చేయమని అడిగారని, అయితే తాను ఒప్పుకోలేదని అన్నారు. […]

Written By: NARESH, Updated On : March 26, 2023 2:30 pm
Follow us on

Mallareddy – Pawan Kalyan : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఈ మధ్య ట్రెండీగా మారారు. కొన్ని నెలలుగా రాజకీయంగా ఆయన చేసే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా సినీ ఇండస్ట్రీపై బాంబ్ పేల్చారు. ఏ కార్యక్రమానికి వెళ్లినా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేతత్వం మల్లారెడ్డిది. అందుకే ఆయన ప్రసంగంపై అందరికీ ఆసక్తి ఉంటుంది. తాజాగా మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ సినిమాలో తనను విలన్ గా చేయమని అడిగారని, అయితే తాను ఒప్పుకోలేదని అన్నారు. ‘మేం ఫేమస్’ అనే సినిమా టీజర్ కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ డైరెక్షన్ చేసిన మూవీ ‘మేం ఫేమస్’. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న ఈ మూవీ టీజర్ ఫంక్షన్ ను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన యూత్ లో జోష్ నింపే విధంగా ప్రసంగం చేశారు. యూత్ మొత్తం ఫేమస్ కావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు నేను ఎంత ఫేమసో మీకు తెలుసన్నారు. పాలమ్మి పైకి వచ్చానన్నారు. కాలేజీలు పెట్టి ఎంతోమంది జీవితాలను మార్చానని అన్నారు.

నాకు 23 ఏళ్లలోనే పెళ్లి అయిందని, ఆ సమయంలో నా దగ్గర డబ్బు లేదన్నారు. గెదేలు పెంచుతూ పాలు అమ్మానని అన్నారు. ఆ తరువాత పూలు కూడా అమ్మి జీవితాన్ని గడిపిన రోజులున్నాయని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో నేను మంత్రిని అయ్యాను. ఈ క్రమంలో కాలేజీలు పెట్టి ఎంతో మంది డాక్టర్లను చేసిన.. టాప్ డాక్టర్లు, సైంటిస్టులు ఇప్పుడు విదేశాల్లో కొనసాగుతున్నారు. నేను జీవితంలో ఎన్నో కష్టాలు పడుకుంటూ అత్యున్నత స్థితికి వచ్చాను. అందుకే నేను ఫేమస్ అయ్యానని మంత్రి అన్నారు.

అమ్మాయిల వెంట తిరగడం.. దూమపానం, మద్యాపనం చేయడం ఫేమస్ కాదు.. కష్టపడి జీవితంలో పైకి రావడమే ఫేమస్ అనిఅన్నారు. ఇప్పుడున్న యువత కూడా కష్టపడుతూ లక్ష్యం చేరుకోవాలని అన్నారు. ఎంతో తక్కువ వయసులోనే ఫేమస్ అయిన సినిమా డైరెక్టర్ సుమంత్ ప్రభాస్ ను మంత్రి అభినందించారు. ఈ సినిమా టీజర్ నాకెంతో నచ్చింది. తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఈ సినిమా సక్సెస్ అయ్యాక ఈ హీరోతో కలిసి నేనొక సినిమా తీస్తా.. అలాగే ఎన్నికలు అయిపోయాక తెలంగాణ యాసలో పలు చిత్రాలు నిర్మిస్తానని మంత్రి అన్నారు.

అయితే ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ తన దగ్గరకు వచ్చి పవన్ కల్యాణ్ సినిమాలో విలన్ గా నటించమని అడిగారు. గంట సేపు బతిమిలాడారు. కానీ నేను ఒప్పుకోలేదు. అని మంత్రి అన్నారు. మంత్రి మల్లారెడ్డి ఏ ఫంక్షన్ కెళ్లినా ఉత్సాహంగా అక్కడున్ వారిని జోష్ లో ముంచెత్తుతారు. ‘మేం ఫేమస్’ టీజర్ కార్యక్రమంలో మంత్రి మాట్లాడినప్పుడు అక్కడున్నవాళ్లంతా ఈలలు వేస్తూ గోల చేశారు. ఈ కార్యక్రమం సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.