
బాలీవుడ్ హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సంఘటన జరిగి నెలలు గడుస్తున్నా.. దేశ వ్యాప్తంగా ఇంకా ఈ కేసు సంచలనంగానే ట్రెండ్ అవుతోంది. ఒక హీరో.. పైగా స్టార్ డమ్ తెచ్చుకుని ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక హీరో.. ఇలా అర్ధంతరంగా చనిపోవడం సినీ ప్రేముకుల మనసులను తీవ్రంగా కలిచివేసిందనేది ప్రతి ఒక్కరి మనోగతం. దానికి తోడు సుషాంత్ మరణం పై రోజురోజుకూ అనేక ఆరోపణలు తెరపైకి వస్తుండటం.. అందుకు తగ్గట్టుగా ఈ కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించడంతో సుశాంత్ అభిమానులతో పాటు యావత్తు సినీ జనాలు కూడా అసలు ఏం జరిగిందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, విచారణ జరిపే కొద్దీ కేసు మరింత జఠిలమైవుతుంది. సీబీఐ వేగంగా దర్యాప్తు చేస్తోన్నా.. నిజానిజాలు ఏమిటనేది ఇంకా స్పష్టత రాని పరిస్థితి.
Also Read: మెగా మేనల్లుడు క్లిక్ అయ్యేలా ఉన్నాడు !
మరోపక్క అధికారులు సుషాంత్ నివాసంలో మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. తాజాగా సుషాంత్ మరణం పై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన మరో సంచలన ఆరోపణ ఇప్పుడు అందర్నీ షాక్ కి గురి చేస్తోంది. సుషాంత్ పై విష ప్రయోగం జరిగిందని.. ఆ వాస్తవాలు బయటకు రాకుండా కొందరు కుట్ర పన్నారని సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణ నిజమా అబద్దమా అనే విషయం పక్కన పెడితే.. సుశాంత్ పోస్ట్ మార్టం విషయంలో కావాలనే ఆలస్యం చేశారని ఇప్పటికే రుజువు అయింది. ఇది ఎంత దారుణం.. ఒక స్టార్ హీరో చనిపోతే.. అతని బాడీ పోస్టు మార్టం చేయడానికి ఆలస్యం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. సుశాంత్ మరణం దేశంలోనే ప్రధాన వార్త.. అలాంటి ప్రాధాన్యత ఉన్న వ్యక్తి చావుకే న్యాయం జరగకపోతే సామాన్యుల పై అన్యాయాలకు ఇంక న్యాయం ఏమి జరుగుతోంది.
Also Read: ఆదిపురుష్ మొదలయ్యేది ఎప్పుడంటే..?
సుశాంత్ చావుకు బాధ్యులైన వారందర్నీ కఠినంగా శిక్షించాలని సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేసినట్లుగానే మోదీ ప్రభుత్వం ఈ కేసును ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్స్ పై సీబీఐ అధికారులు ఎలా స్పందిస్తారు? సుషాంత్ మరణం వెనుక పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నారనే ఆరోపణలను అధికారులు ఎలా తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే కొన్ని పెద్ద తలకాయల్ని సైతం పోలీసులు విచారించారు. ఒక్క బాలీవుడ్ నుంచే దాదాపు 43 మందిని విచారించారంటే… సీబీఐ ఈ కేసు విషయంలో ఎంతగా విశ్వసనీయత చూపిస్తోందో అర్ధం చేసుకోవచ్చు. ఏమైనా సుషాంత్ పై విష ప్రయోగం జరిగిందనేది నిజమని తెలితే.. అందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి.