
Viral video : మనం రోజు ఉదయం పూట టిఫిన్ చేస్తాం. అందులో బెస్ట్ టిఫిన్ ఏంటంటే దోశ అని చెబుతారు. దోశలు తినడంలో దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ముందుంటాయి. రోజు ఉదయం పూట కడుపులో ఏదో ఒకటి పడాల్సిందే. అది దోశ అయితే ఆ మజాయే వేరుగా ఉంటుంది. దోశ మీద ఉల్లిపాయలు చల్లితే ఉల్లి దోశ అని ఆలు పెడితే మసాలా దోశ అని పిలుస్తారు. దోశలు వేసుకుని తినడంలో మనమే ముందుంటాం. అలాంటి దోశకు ఇప్పుడు పలు రకాల పేర్లు పెడుతున్నారు.
పిచ్చి ముదిరింది రోకలి తలకు చుట్టు అన్నట్లుంది. దోశలు తినడంలో మనకున్న బలహీననతను క్యాష్ చేసుకుంటున్నారు. ఈ మధ్య హోటళ్లలో దోశల మీద ఏదో ఒకటి వేస్తూ ఆడుకుంటున్నారు. దానిమీద చాక్లెట్ వేసి చాక్లెట్ దోశ అని చెబుతున్నారు. అలాగే బిర్యాణీ వేసి బిర్యాణీ దోశ అని పిలుస్తున్నారు. దోశ అంటే బియ్యం, మినప పిండి పులియబెట్టి వేసుకుని దాని మీద ఉల్లిపాయలు వేసుకుంటే దాని రుచి వేరుగా ఉంటుంది. ఇలా ఏదిపడితే అది వేస్తూ పిచ్చిపిచ్చిగా చేస్తున్నారు.
ఇటీవల కాలంలో మౌత్ రిఫ్రెషనర్ కూడా దాని మీద చల్లుతున్నారు. ఇలా చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇదెక్కడి వెర్రిరా బాబూ దోశను దోశలా కాకుండా కాకులు చింపిన విస్తరిలా మారుస్తున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఏది పెడితే అది తింటారనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. చదువు రాకముందు కాకర కాయ చదువుకున్నాక కీకరకాయ అన్నట్లుగా ఉంది ఈ తతంగం.
దీనిపై సామాజిక మాధ్యమాల్లో పలు రకాల సెటైర్లు వస్తున్నాయి. దోశను దోశలాగా ఉండనీయండి. దాన్ని బతకనీయండి. తినే వారిని కూడా కాస్త చూడండి. ఇలా పలు రకాల తీరుగా పేర్లు పెట్టి టిఫిన్ ప్రియుల మతులు చెడగొడితే మీ గిరాకీకే నష్టం కలుగుతుందని చెబుతున్నారు. ఇంకా దోశల్లో ఏం వెరైటీలు తీసుకొస్తారో తెలియడం లేదని పలువురు కామెంట్లు పెడుతున్నారు.