Telugu OTT platform aha : ‘ఆహా’ ఓటీటీ చేతులు మారబోతుందా?

Telugu OTT platform aha : తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’ ప్రారంభించి మూడు సంవత్సరాలు దాటింది. అల్లు అరవింద్ మానస పుత్రికగా దీన్ని ప్రారంభించారు. మైహోం జూపల్లి రామేశ్వరరావు ప్రధాన వాటాదారుగా, అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ కలిపి పెట్టారు. ఇందులో మరికొందరు వాటాదారులు కూడా ఉన్నారు. పోయిన సంవత్సరం ‘ఆహా తమిళ్’ కూడా ప్రారంభించారు. ఆహా ఓటీటీకి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ స్టార్ హీరో అల్లు అర్జున్ ఉన్నారు. తెలుగు వాళ్లు పెట్టి […]

Written By: NARESH, Updated On : April 25, 2023 10:37 am
Follow us on

Telugu OTT platform aha : తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’ ప్రారంభించి మూడు సంవత్సరాలు దాటింది. అల్లు అరవింద్ మానస పుత్రికగా దీన్ని ప్రారంభించారు. మైహోం జూపల్లి రామేశ్వరరావు ప్రధాన వాటాదారుగా, అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ కలిపి పెట్టారు. ఇందులో మరికొందరు వాటాదారులు కూడా ఉన్నారు. పోయిన సంవత్సరం ‘ఆహా తమిళ్’ కూడా ప్రారంభించారు. ఆహా ఓటీటీకి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ స్టార్ హీరో అల్లు అర్జున్ ఉన్నారు.

తెలుగు వాళ్లు పెట్టి పోషించి ఇంత స్తాయికి తీసుకొచ్చిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గా ‘ఆహా’ ఖ్యాతికెక్కింది. ఇది పాపులర్ షోలు కూడా చాలా చేసింది. ‘అన్ స్టాపబుల్ ’ పేరిట బాలయ్య షో బాగా పాపులర్ అయ్యింది. సబ్ స్కైబర్స్ మిలియన్లలో ఉన్నారు. ఇది పాపులర్ ఓటీటీ కిందనే దీన్ని లెక్క కట్టాలి.

‘ఆహా’ నుంచి ఎలాంటి నెగెటివ్ రిపోర్టులు లేవు. ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ మార్కెట్ పెరుగుతూ వస్తోంది. దీనిలో సమస్య ఏంటంటే ఓటీటీ మార్కెట్ లో పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్లు వేల కోట్ల పెట్టుబడులు తెచ్చే సామర్థ్యం కలవారు. నెట్ ఫ్లిక్స్, డిస్నీ + హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు ఇవి ప్రపంచ స్థాయి సంస్థలు. ప్రతీదేశంలోనూ ఉన్నాయి. వారికి ఎన్నో వేల కోట్ల డాలర్ల సామర్థ్యం ఉన్న అతిపెద్ద సంస్థలు.

ఆహా ప్రస్తుతం తెలుగులోనే పాపులర్. మార్కెట్ చిన్నది. తమిళంలో అంత హిట్ కాలేదు. అంతర్జాతీయ సంస్థలతో డబ్బులు, పెట్టుబడుల విషయంలో ఆహా పోటీపడలేకపోతోంది. అందుకే ‘ఆహా’ను అమ్మకానికి పెట్టినట్టుగా ప్రచారం సాగుతోంది. దీనిపై ఆహా కూడా ఖండించలేదు.

ఆహా చేతులు మారబోతుందా? ఈ మేరకు మీడియాకు ఈ సమాచారం లీక్ అయ్యిందా? అసలు ఎందుకు అమ్ముతున్నారు? దాని వెనుక కథేంటి? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.