
Shivathmika Rajshekar Photo shoot : ఆమె స్టార్ హీరో వారసురాలు. ఓ దిగ్గజ దర్శకురాలి కూతురు. ఇండస్ట్రీలో వాళ్ల ఫ్యామిలీకి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉంది. అయితే మగ సంతానం లేకపోవడంతో ఇద్దరు కూతుళ్లు ఇప్పుడు హీరో వారసురాళ్లుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. తమదైన అందచందాలు, నటనతో ఆకట్టుకుంటున్నారు. అందులో ఒకరు శివాత్మిక రాజశేఖర్.

రాజశేఖర్-జీవితల ముద్దుల కూతురు శివాత్మిక ఆ మధ్యన విజయ్ దేవరకొండ తమ్ముడు హీరోగా వచ్చిన దొరసాని సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకున్నా ఈమె నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘రంగమార్తండ’ సినిమాలో శివాత్మిక నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో ఆమె కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు.. రంగమార్తండలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర చేయడం కూడా శివాత్మికకు బాగా మైనస్ గా మారింది.

ఆడపా దడపా పలు సినిమాల్లో నటిస్తున్న శివాత్మిక సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్ గా ఉంటోంది. అందచందాలన్నీ పంచుకుంటోంది. హాట్ ఫొటోలతో కుర్రకారు మదిపోయేలా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది.
ఈరోజు శివాత్మిక పుట్టినరోజు. 2000 ఏప్రిల్ 22న ఆమె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఈ అమ్ముడు సోషల్ మీడియాలోనే తన అందాలన్నీ ఆరబోస్తోంది.