Valentine’s Day Special: ప్రేమ.. తప్పు ఉప్పులతో సంబంధం లేకుండా ఒక మనిషిని యధాతధంగా అంగీకరిస్తుంది. పూర్వకాలంలో మజ్ను, దేవదాసు వంటివారు తమ ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేశారు. చివరికి తమ ప్రేమ సఫలీకృతం కాకపోయినప్పటికీ.. ఆ విరహ వేదనతోనే కన్నుమూశారు. ప్రేమలో ఉన్న గాఢత, స్వచ్ఛత అటువంటిది.. అందువల్లే ప్రేమ గురించి.. ప్రేమికుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు వారి పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి.
అయితే నేటి కాలంలో ప్రేమ అనేది అనేక విధాలుగా రూపాంతరం చెందింది. రెండు అక్షరాల పదం కాస్త.. రెండు హృదయాల కలయిక కాస్త పెడపోకడలకు దారి తీస్తోంది. సులభంగా ప్రేమలో పడటం.. మనస్పర్ధలు ఏర్పడి త్వరగా విడిపోవడం వంటివి ఇటీవల కాలంలో ఎక్కువైపోయాయి.. ప్రేమకు ఒకప్పుడు ప్రేమికులు ఎంతో విలువ ఇచ్చేవారు.. కానీ ఇప్పటి కాలంలో అలా లేదు. చిన్న చిన్న విషయాలకి గొడవలు పడి ప్రేమికులు విడిపోతున్నారు. పైగా కక్షలు పెంచుకొని రకరకాల దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఒకరిపై ఒకరు ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. ఇలాంటి వాటి ద్వారా పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఇలాంటి సంఘటన ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది..
ఓ యువతికి, ఆమె బాయ్ ఫ్రెండ్ కు మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో వారిద్దరూ విడిపోయారు.. ఈ క్రమంలో ఎలాగైనా అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె భావించింది.. ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే నాడు ఎందుకు ముహూర్తంగా పెట్టుకుంది. ఏకంగా 100 పిజ్జాలు ఆర్డర్ చేసింది.. అయితే ఆమె తన మాజీ బాయ్ ఫ్రెండ్ అడ్రస్ పెట్టింది. పైగా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకుంది. డెలివరీ బాయ్ 100 ఫిజ్జాలు తీసుకొని అక్కడ ఇంటి ముందుకు వచ్చాడు.. ఆ తర్వాత డబ్బులు ఇయ్యమని అడిగాడు. అయితే తాను పిజ్జాలు ఆర్డర్ చేయలేదని.. తాను డబ్బులు ఇచ్చేది లేదని.. వీటన్నింటినీ వెనక్కి తీసుకెళ్లాలని ఆ డెలివరీ బాయ్ తో చెప్పాడు. అయితే ఆ డెలివరీ బాయ్ వెనక్కి తీసుకెళ్లడం కుదరదని.. చచ్చినట్టు డబ్బులు కట్టాలని దబాయించాడు. తాను ఆర్డర్ చేయనందున.. ఎవరు ఆర్డర్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నందున.. డబ్బులు ఇవ్వలేనని అతడు తేల్చి చెప్పాడు. చివరికి ఏం జరిగిందో తెలియదు కాని.. ఆ డెలివరీ బాయ్ వెనక్కి వెళ్ళిపోయాడు. అయితే ఈ వ్యవహారం మొత్తం ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో సంచలనగా మారింది. బ్రేకప్ జరిగినప్పటికీ.. ఇలా అతడి అడ్రస్ మీద వంద ఫిజ్జాలు ఆర్డర్ ఇచ్చి ఆ యువతి నాయకురాలు నాగమ్మను మించిపోయిందని సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.. ప్రేమ అంటే స్వచ్ఛంగా ఉంటుంది, త్యాగాన్ని కోరుకుంటుంది, ఎదుటి వ్యక్తి క్షేమాన్ని కోరుకుంటుంది.. ఇలా ప్రతీకారాన్ని కోరుకోదని వారు చురకలు అంటిస్తున్నారు. మొత్తానికి వాలంటైన్స్ డే నాడు ఈ ఘటన జరగడం చర్చకు దారి తీస్తోంది.
మాజీ ప్రియుడికి షాక్ ఇచ్చిన యువతి
ప్రేమికుల రోజు సందర్భంగా తన మాజీ బాయ్ ఫ్రెండ్ కు సర్ప్రైజ్ ఇద్దామని అనుకుందో యువతి.
వాలంటైన్స్ డే రోజని ఆమె ఏకంగా 100 పిజ్జాలను అతడి కోసం ఆర్డర్ చేసింది. ట్విస్ట్ ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీతో వీటిని ఆర్డర్ చేయగా యష్ షాక్ అయ్యాడు.… pic.twitter.com/PUqrOo0Pqu
— greatandhra (@greatandhranews) February 14, 2025