https://oktelugu.com/

JioHotstar: జియో హాట్ స్టార్ లో ఐపీఎల్ ఫ్రీగా చూడటం అంత ఈజీ కాదు.. క్రికెట్ అభిమానులకు షరతులు వర్తిస్తాయి

JioHotstar బడా వ్యాపార సంస్థలైన జియో(jio) , డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney plus hotstar) మొత్తానికి ఒకే గొడుగు కిందికి వచ్చాయి. జియో హాట్ స్టార్( jio hot star) గా రూపాంతరం చెందాయి. ఇకపై అపరితమైన ఎంటర్టైన్మెంట్, సినిమాలు, వెబ్ సిరీస్, హాలీవుడ్ సినిమాలు, స్పోర్ట్స్ వంటివి యూజర్లకు అందుబాటులోకి వస్తాయి..

Written By: , Updated On : February 14, 2025 / 10:12 PM IST
JioHotstar

JioHotstar

Follow us on

JioHotstar: డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జియో సినిమాలో ఉన్న కంటెంట్ మొత్తం జియో హాట్ స్టార్ లో చూడొచ్చు. ఈ ఓటీటీ స్ట్రీమింగ్ సబ్ స్క్రిప్షన్ 149 నుంచి మొదలవుతోంది.. మొబైల్ ప్లాన్ లో ( యాడ్ సపోర్టెడ్ ప్లాన్) ప్రారంభ ధర 149 నుంచి మొదలవుతోంది. దీని వ్యాలిడిటీ మూడు నెలల వరకు ఉంటుంది. ఇక ఏడాది వ్యాల్డిటి ప్లాన్ 499 రూపాయలుగా ఉంది. ఈ ప్లాన్ లో కేవలం మొబైల్ లో మాత్రమే కంటెంట్ చూసేందుకు అవకాశం ఉంటుంది.

రెండు డివైస్ లకు సపోర్ట్ చేసే రెండు సూపర్ ప్లాన్లు (యాడ్ సపోర్ట్ ప్లాన్) కూడా ఉన్నాయి. మూడు నెలల వ్యాధితో ఈ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది జియో హాట్ స్టార్. ఈ ప్లాన్ ధర 299 రూపాయలుగా ఉంది. ఏడాది వ్యాలిడిటీ 899 రూపాయల్లో లభిస్తోంది.

ప్రకటనలు లేకుండా కంటెంట్ చూడాలనుకునే వారికోసం జియో హాట్ స్టార్ రెండు ప్రీమియం ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ నెలకు 299 రూపాయలతో మొదలవుతుంది. మూడు నెలల ప్రీమియం ప్లాన్ వీక్షించాలి అనుకుంటే 499 రూపాయలు చెల్లించాలి. ఏడాది పాటు చూడాలి అనుకుంటే 1499 రూపాయలు చెల్లించాలి.. ఈ ప్రీమియం ప్లాన్ లలో నాలుగు డివైస్ లలో కంటెంట్ చూడవచ్చు.

ఇక ఇప్పటివరకు ఐపీఎల్ మ్యాచ్లను గత రెండు సీజన్ల నుంచి జియో సినిమా, అంతకుముందు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఉచితంగా చూసే అవకాశాన్ని వీక్షకులకు కల్పించాయి. అయితే ఈసారి ఐపీఎల్ మ్యాచ్ లను ఉచితంగా చూసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే కనీస ప్లాన్ 149 తో సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ జియో హాట్ స్టార్ గా అవతరించిన నేపథ్యంలో.. ప్రస్తుతం హాట్ స్టార్ .. అప్డేట్ అనంతరం జియో హాట్ స్టార్ గా మారుతుంది. జియో సినిమా కూడా జియో హాట్ స్టార్ లాగా మారుతుంది. అయితే ఇప్పటికే హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ గనుక తీసుకొని ఉంటే.. వచ్చే మూడు నెలల పాటు వారికి పాతదలు మాత్రమే కొనసాగుతాయి. ఒకవేళ జియో సినిమా ప్రీమియం సబ్ స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లు ఆటోమెటిక్ గా జియో హాట్ స్టార్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ యూజర్లు మారిపోతారని జియో హాట్ స్టార్ వర్గాలు ఈ సందర్భంగా చెబుతున్నాయి.