https://oktelugu.com/

Vaishnav Tej: హాట్ హీరోయిన్ తో పంజా వైష్ణవ్ తేజ్ ప్రేమాయణం.. డేటింగ్ చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారుగా!

Vaishnav Tej: ‘ఉప్పెన’ సినిమా సాయి ధరమ్ తేజ్ తమ్ముడిగా చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ మేనల్లుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన పంజా వైష్ణవ్ తేజ్, ఆ సినిమాతో సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఒక డెబ్యూ హీరో సినిమాకి 60 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రావడం అనేది ఎప్పుడూ జరగలేదు, అది వైష్ణవ్ తేజ్ విషయంలోనే జరిగింది. ఆ సినిమా తర్వాత ఆయన చేసిన రెండు […]

Written By:
  • Vicky
  • , Updated On : April 20, 2023 / 05:41 PM IST
    Follow us on

    Vaishnav Tej

    Vaishnav Tej: ‘ఉప్పెన’ సినిమా సాయి ధరమ్ తేజ్ తమ్ముడిగా చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ మేనల్లుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన పంజా వైష్ణవ్ తేజ్, ఆ సినిమాతో సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఒక డెబ్యూ హీరో సినిమాకి 60 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రావడం అనేది ఎప్పుడూ జరగలేదు, అది వైష్ణవ్ తేజ్ విషయంలోనే జరిగింది.

    ఆ సినిమా తర్వాత ఆయన చేసిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. గత ఏడాది ఆయన హీరో గా నటించిన ‘రంగ రంగ వైభవంగా’ చిత్రం లో కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆన్ స్క్రీన్ మీద వీళ్లిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. అయితే వీళ్ళు కేవలం ఆన్ స్క్రీన్ మీదనే కాదు, బయట కూడా ప్రేమికులే అని విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో లేటెస్ట్ వినిపిస్తున్న వార్త.

    ‘రంగ రంగ వైభవంగా’ సినిమా షూటింగ్ సమయం లోనే వీళ్లిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారని, ఆ తర్వాత నిజ జీవితం లో ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంత గా మారిపోయారని తెలుస్తుంది. వీళ్లిద్దరు కలిసి ఈమధ్య ప్రైవేట్ పార్టీలకు వెళ్లి ఎంజాయ్ చెయ్యడం వంటివి కొంతమంది హైదరాబాద్ సిటీ లో గమనించారు,అప్పటి నుండే వీళ్లిద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారు అనే వార్త బయటకి వచ్చింది.

    Vaishnav Tej

    అంతే కాదు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి సాయి ధరమ్ తేజ్ తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా చిత్తం’ రీమేక్ లో నటించిన సంగతి తెలిసిందే.ఇందులో ఒక హీరోయిన్ గా కేతిక శర్మ చేసింది. ఆమెని ఈ చిత్రం లో హీరోయిన్ గా తీసుకోవాల్సిందిగా రికమెండ్ చేసింది పంజా వైష్ణవ్ తేజ్ అట. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ సినిమాలో అవకాశం అంటే మామూలు విషయం కాదు, సూపర్ హిట్ అయితే రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లిపోగలదు,మరి ఆమె అదృష్టం ఎలా ఉందో చూడాలి.