
Waltair Veerayya: ఈ ఏడాది ప్రారంభం లో సంక్రాంతి పండగ టాలీవుడ్ కి కాసుల కనకవర్షం కురిపించిన సంగతి తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మరియు నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ సినిమాలు ఒక్క రోజు తేడాతో విడుదలై ప్రభంజనం సృష్టించాయి.ఈ రెండు సినిమాల్లో ‘వాల్తేరు వీరయ్య’ దే పై చెయ్యి.
సుమారుగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించి మెగాస్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా.మరో పక్క బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ చిత్రం కేవలం 70 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది.ఈ రెండు చిత్రాలు ‘మైత్రీ మూవీ మేకర్స్’ నిర్మాణం లో తెరకెక్కిన విషయం తెలిసిందే.అయితే రీసెంట్ గానే ‘వీర సింహా రెడ్డి’ వంద రోజుల వేడుక అతి త్వరలోనే జరపబోతున్నాము అంటూ అధికారిక ప్రకటన చేసింది మూవీ టీం.

మరోపక్క ‘వాల్తేరు వీరయ్య’ 100 రోజుల వేడుకలను జరపడానికి కూడా సన్నాహాలు చేస్తుందట మూవీ టీం.మెగాస్టార్ చిరంజీవి అనుమతి కోసం ఎదురు చూస్తున్నారట,ఆయన ఓకే అనగానే ఈ వంద రోజుల వేడుకకి సంబంధించి అధికారిక ప్రకటన చేయనుంది మైత్రీ మూవీ మేకర్స్.అయితే ఈ వంద రోజుల వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిథిగా పిలిచే ఆలోచనలో ఉందట మైత్రీ మూవీ మేకర్స్.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ముంబై లో #OG మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
ఈ నెలాఖరు వరకు జరగనున్న ఈ షెడ్యూల్ తర్వాతే ఆయన హైదరాబాద్ కి తిరిగి వస్తాడు,ఆయన వచ్చిన వెంటనే కలిసి ఈ ఫంక్షన్ కి ఆహ్వానించబోతున్నారట.ఈ సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికి వంద రోజుల షీల్డ్స్ ని ఇవ్వనున్నారు.ఈ గ్రాండ్ ఈవెంట్ కి సంబంధించి మరికొన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.