
Vepada Chiranjeevi Rao: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ నగరా మోగింది. ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 16న నోటిఫికేషన్ వెలువడనుంది. అయితే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇక్కడ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ ఉన్నారు. మరోసారి పోటీకి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఎన్నడూ లేని విధంగా రాజకీయ పార్టీలు బరిలో దిగుతుండడం పోటీ ఆసక్తిగా మారింది. అధికార వైసీపీ తరపున బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పోటీచేస్తుండగా.. టీడీపీ తరుపున వేపాడ చిరంజీవిరావు బరిలో నిలిచారు. అయితే అనూహ్యంగా టీడీపీ అభ్యర్థిని మార్చడంపై రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. తొలుత బీసీ మహిళను ఎంపిక చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు సడెన్ గా అభ్యర్థిని మార్చడం హాట్ టాపిక్ గా మారింది. సొంత పార్టీలో అయోమయం నెలకొనగా.. ప్రత్యర్థులకు అది ప్రచారాస్త్రంగా మారింది.
Also Read: Mahasena Rajesh: మహాసేన రాజేశ్ పార్టీ మార్పు వార్తల్లో నిజమెంత?
భీమిలి మునిసిపల్ మాజీ చైర్ పర్సన్, ప్రస్తుత జీవీఎంసీ కార్పొరేటర్ గాడు చిన్నకుమారి లక్ష్మిని తొలుత ఎమ్మెల్సీ అభ్యర్థిగా చంద్రబాబు మూడు నెలల కిందటే ఖరారు చేశారు. దాదాపు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల్లో ఆమె పరిచయ కార్యక్రమాన్ని కూడా గ్రాండ్ గా చేశారు. నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే నేతలెవరూ పోటీకి ముందుకు రాకపోవడం వల్లే చిన్నకుమారి లక్ష్మిని ఎంపిక చేశారని అప్పట్లో టాక్ నడిచింది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ ను పోటీలో దింపుతారని ప్రచారం జరిగినా అయ్యన్న పెద్దగా మొగ్గుచూపలేదు. దీంతో బీసీ వర్గానికి చెందిన చిన్నకుమారి లక్ష్మిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్సీగా పోటీచేసేందుకు దాదాపు రూ.4 కోట్లు వరకూ ఖర్చవుతుందని..అంత మొత్తం భరించుకుంటేనే పోటీ చేయాలని హైకమాండ్ పెద్దల సూచనకు చిన్నకుమారి లక్ష్మి ఒప్పుకోవడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మిగతా మొత్తం పార్టీ సర్దుబాటు చేసుకుంటుందన్నది ఒప్పందం. అయితే ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎమ్మెల్సీ ఎన్నికల ఖర్చు భరించేందుకు నియోజకవర్గ ఇన్ చార్జిలు ముందుకు రావడం లేదు. పైగా నియోజకవర్గాల నుంచి అభ్యర్థికి నేరుగా ఫోన్లు వెళుతున్నాయి. ఖర్చులకు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో చిన్నకుమారి లక్ష్మి నేతల ఫోన్లు ఎత్తడం కూడా మానేశారని.. హైకమాండ్ కు ఫిర్యాదులు వెళ్లడంతోనే ఆమెను మార్చేశారన్న టాక్ నడుస్తోంది.
అయితే అనూహ్యంగా చంద్రబాబు కొత్తగా వేపాడ చిరంజీవిరావు అనే అభ్యర్థిని ప్రకటించారు. ప్రభుత్వ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఆయన పోటీచేయడానికి ఆసక్తి చూపారు. ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీవిరమణ చేశారు. ఆయన కాపు సామాజికవర్గానికి చెందిన వారు. గాడు చిన్నకుమారి లక్ష్మిని సంప్రదించిన తరువాత.. ఆమె సమ్మతం మేరకే చిరంజీవిరావును ఎంపిక చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ నేతలు, అనుకూల మీడియాలో మాత్రం బీసీ మహిళను మోసం చేశారని.. ఆమెకు మాటమాత్రంగానైనా చెప్పకుండా అభ్యర్థిత్వాన్ని మార్పు చేయడంపై రకరకాల ప్రచారం మొదలుపెట్టేశారు.
Also Read:AP Early Elections: ఏపీలో సెప్టెంబర్ లోనే ముందస్తు ఎన్నికలు.. చరిత్ర ఏం చెబుతోంది ?