https://oktelugu.com/

వైఫై వాడుతున్నారా.? డేంజర్ లో ఉన్నట్టే..

అరచేతిలో స్మార్ట్ ఫోన్.. దానికి ఇంటర్ నెట్ తప్పనిసరి.. దీంతో అందరూ ప్రతి ఇంట్లో వైఫైని పెట్టించుకుంటున్నారు. ఇంట్లో ఆఫీసుల్లో, బస్టాండ్లు,మాల్స్,రెస్టరెంట్స్,విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్స్ వివిధ ఆఫీసుల్లో ఇప్పుడు అందరికీ వైఫై అందుబాటులో ఉంటోంది. దీంతో అందరూ ఫోన్లో ఫాస్ట్ ఇంటర్ నెట్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ Wi-Fi సిగ్నల్‌ ల వలన మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. Also Read: పానీపూరీ తింటే ప్రాణం పోయింది… ఎలా […]

Written By:
  • NARESH
  • , Updated On : September 24, 2020 / 08:05 PM IST
    Follow us on

    అరచేతిలో స్మార్ట్ ఫోన్.. దానికి ఇంటర్ నెట్ తప్పనిసరి.. దీంతో అందరూ ప్రతి ఇంట్లో వైఫైని పెట్టించుకుంటున్నారు. ఇంట్లో ఆఫీసుల్లో, బస్టాండ్లు,మాల్స్,రెస్టరెంట్స్,విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్స్ వివిధ ఆఫీసుల్లో ఇప్పుడు అందరికీ వైఫై అందుబాటులో ఉంటోంది. దీంతో అందరూ ఫోన్లో ఫాస్ట్ ఇంటర్ నెట్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ Wi-Fi సిగ్నల్‌ ల వలన మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు.

    Also Read: పానీపూరీ తింటే ప్రాణం పోయింది… ఎలా అంటే..?

    Wi-Fi పరికరాల నుండి వచ్చే రేడియోఫ్రీక్వెన్సీ రేడియేషన్‌కు గురి కావడం వలన ఆరోగ్యవంతమైన కణాల అభివృద్ధికి ముఖ్యంగా పిండాభివృద్ధికి అంతరాయం కలుగుతుందని చెబుతారు నిపుణులు పరిశోధనలో తేల్చారు. తాజాగా ఎలుకలపై నిర్వహించిన అధ్యయనంలో మూత్రపిండాల అభివృద్ధికి జాప్యం ఏర్పడినట్లు తెలిసింది. Wi-Fi ఆన్‌లో ఉండగా లేదా సెల్ ఫోన్ సమీపంలో ఉంచుకుని పడుకోవడం వలన దీర్ఘకాల నిద్ర సమస్యలు సంభవిస్తాయి.Wi-Fi నుండి నిరంతరంగా వచ్చే ప్రసరణలు నిద్రకు అంతరాయం కలిగిస్తాయట. 30 నిమిషాల ఆర్ఎఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ రేడియేషన్ వలన మెదడులోని కొన్ని స్థానాల్లో అత్యల్ప ఫ్రీక్వెన్సీ హెచ్చుతగ్గులకు ఏర్పడతాయని తేలింది.

    ల్యాప్‌ట్యాప్‌ల నుండి వచ్చే వేడి వీర్యకణాలకు హాని చేస్తుందని తెలిసిన విషయమే. Wi-Fi రేడియేషన్ వలన వీర్య చలనశీలత తగ్గి, డిఎన్ఎలో వైవిధ్యాలు సంభవిస్తాయని తేలింది.పరిశోధకులు వీర్య నమూనాలను 4 గంటలపాటు వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్ట్ అయిన ల్యాప్‌టాప్‌కు సమీపంలో ఉంచి… అభివృద్ధి చెందుతున్న వీర్యం యొక్క చలనశీలత గణనీయంగా తగ్గిపోవడాన్ని మరియు డిఎన్ఎ విచ్ఛిన్నం కావడాన్ని గుర్తించారు.

    Also Read: మందుబాబులకు కిక్కెక్కించే వార్త.. ఇకపై ఆన్ లైన్ లో మద్యం..?

    వైర్‌లెస్ పరికరాల నుండి వచ్చే మైక్రోవేవ్ రేడియేషన్ (ఎమ్‌డబ్ల్యూఆర్) వలన పుట్టని శిశువులు చిన్న పిల్లల మెదడు కణజాలాలు ప్రభావితమవుతాయి, పుర్రె చిన్నగా మరియు పల్చగా ఏర్పడుతుంది.ముఖ్యంగా పిండానికి ఎమ్‌డబ్ల్యూఆర్ కిరణాలు వలన తీవ్ర హాని కలుగుతుంది. దీంతో ఇప్పటికైనా వైఫైని విరివిగా వాడకుండా అందరి ఆరోగ్యాలను కాపాడుకోండి..