తల్లిదండ్రులను బిచ్చగాళ్లను చేసిన కొడుకు… మనిషేనా అంటున్న నెటిజన్లు..?

ఈ భూప్రపంచంలో పిల్లలకు కల్మషం లేకుండా లభించే ప్రేమ ఏదైనా ఉందా అంటే అది తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే. తల్లిదండ్రులు పిల్లలు ఏం అడిగినా కాదనరు. పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటారు. పిల్లల భవిష్యత్తు కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. తల్లిదండ్రులు తిన్నా తినకపోయినా పిల్లలు కడుపునిండా తింటే చాలని అనుకుంటారు. Also Read : ట్రబుల్ షూటర్ ‘సెంటిమెంట్’ రాజకీయం వర్కవుట్ అవుతుందా? అయితే పిల్లలపై తల్లిదండ్రులు ఆకాశమంత […]

Written By: Navya, Updated On : September 25, 2020 11:46 am
Follow us on

ఈ భూప్రపంచంలో పిల్లలకు కల్మషం లేకుండా లభించే ప్రేమ ఏదైనా ఉందా అంటే అది తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే. తల్లిదండ్రులు పిల్లలు ఏం అడిగినా కాదనరు. పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటారు. పిల్లల భవిష్యత్తు కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. తల్లిదండ్రులు తిన్నా తినకపోయినా పిల్లలు కడుపునిండా తింటే చాలని అనుకుంటారు.

Also Read : ట్రబుల్ షూటర్ ‘సెంటిమెంట్’ రాజకీయం వర్కవుట్ అవుతుందా?

అయితే పిల్లలపై తల్లిదండ్రులు ఆకాశమంత ప్రేమను చూపిస్తుంటే పిల్లలు మాత్రం వాళ్లను రోడ్లపైకి తెస్తున్నారు. సంతోషంగా జీవితం గడుపుతున్న వాళ్లకు సమస్యలు సృష్టిస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలంలో చోటు చేసుకున్న ఘటన సమాజంలో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా…? అసలతను మనిషేనా..? అనే ప్రశ్నలు వ్యక్తమయ్యేలా చేస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే రామాయంపేట మండలం డి.ధర్మారం గ్రామానికి చెందిన అంజమ్మ, నాగయ్య దంపతులకు ఒక్కడే కొడుకు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించిన అంజమ్మ, నాగయ్య కొడుకును కంటికి రెప్పలా చూసుకుంటూ అడిగింది కాదనకుండా ఇచ్చేవారు. కొన్ని నెలల క్రితం కొడుకుకు పెళ్లి కూడా చేశారు. అయితే కొత్త కోడలు అత్తామామలతో, భర్తతో గొడవ పడి పొలం, ఇల్లు అమ్మించింది.

ఆ డబ్బుతో కొడుకు కోడలు హైదరాబాద్ లో ఫ్లాట్ కొనుక్కున్నారు. అంజమ్మ, నాగయ్య కొడుకు కోడలు దగ్గర ఉంటున్నా వాళ్లకు సరిగ్గా తిండి పెట్టక కొడుకు కోడలు ఇబ్బందులకు గురి చేసేవారు. చివరకు కొడుకు తల్లి మెడలోని తాళిబొట్టును కూడా అమ్మేశాడు. కొడుకు కోడలు పట్టించుకోకపోవడంతో వాళ్లు సొంతూరికి వహ్క్చేశారు. ఊరిలో సొంత ఇల్లు లేకపోవడంతో ఖాళీ స్థలంలో నివాసం ఉంటూ తెలిసిన వాళ్లు పెట్టిన ఆహారం తింటూ జీవిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతుండగా నెటిజన్లు తల్లిదండ్రులను బిచ్చగాళ్లను చేసిన కొడుకుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

Also Read : తండ్రిని చంపిన వ్యక్తి కోసం 17 ఏళ్లుగా వెతుకుతున్న కొడుకు.. చివరకు..?