
Google Pay Cashback: ఈమధ్య గూగుల్ పే అనగానే చాలా మంది భయపడిపోతున్నారు. మనీ ట్రాన్స్ ఫర్ కు మంచి వేదిక అని చాలా మంది ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. క్యాష్ బ్యాక్ కూడా ఇస్తుండడంతో ఎక్కువమంది లైక్ చేశారు. దీని ద్వారా డబ్బులు ఎవరికైనా పంపితే మధ్యలోనే స్ట్రక్ అవుతున్నాయి. 24 గంటలు గడిస్తే గానీ మనీ రిఫండ్ కావడం లేదు. ఎమర్జెన్సీ ఉన్నవాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా మంది ‘జీ పే’ను అవైడ్ చేస్తున్నారు. ప్రత్యామ్నాయ వాటి కోసం వెతుకుతున్నారు. అయితే లేటేస్టుగా జీ పే భారీగా క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్లు సమాచారం. ఓ వ్యక్తికి ఏకంగా 1000 డాలర్ల క్యాష్ బ్యాక్ వచ్చిందట. అలా మొత్తం 88 వేల రూపాయల వరకు జీ పే యూజర్ల అకౌంట్లోకి రావడంతో వారు సంబరపడిపోతున్నారు. అయితే గూగుల్ అఫీషియల్ గా వీటిని పంపించలేదట. మరెం జరిగిందంటే?
సాధారణంగా గూగుల్ పే ద్వారా క్యాష్ బ్యాక్ స్క్రాచ్ కార్డు వస్తుంది. ఇందులో మాగ్గిమమ్ రూ.6 కంటే ఎక్కువ చెల్లించలేదని కొందరు వినియోగదారులు పేర్కొంటున్నారు. అయితే ఉన్నట్టుండి వేలకు వేల రూపాయలో ఖాతాల్లో వచ్చిపడుతుంటే యూజర్స్ షాక్ అవుతున్నారు. అయితే వీటిని జీ పే అఫీషియల్ గా పే చేయడం లేదట. పొరపాటున క్రెడిట్ అయిందని అంటున్నారు. ‘డాగ్ పుడింగ్’ అనే ఫీచర్ పరీక్షిస్తున్న సందర్భంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తాలు యూజర్లకు పడిపోయిందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో డబ్బలు రికవరి చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. కొంత మంది యూజర్లకు మెయిల్ ద్వారా సంప్రదించింది. వీలైనంత వరకు రికవరీ చేసింది. అయితే కొందరు చాకచక్యంగా ఈ మనీనీ వేరే వారికి ట్రాన్స్ ఫర్ చేసినా.. లేదా డెబిట్ చేసిన వాళ్లపై మాత్రం ఎలాంటి చర్యలు లేవని తెలిపింది. దీంతో మనీ ట్రాన్స్ ఫర్ చేసుకున్నవాళ్లకు క్యాష్ బ్యాక్ కింద కొంత మొత్తం చెల్లించిందని వారు సంబరపడిపోతున్నారు.
ఇటీవల కాలంలో గూగుల్ పే తోచాలా ఇబ్బందులు ఏర్పడుతున్నారు. దీంతో ఎక్కువ మంది ఫోన్ పే, ఇతర యాప్ లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇలాంటి వారి కోసం గూగుల్ ఇలా చేసిందా? లేక నిజంగానే పొరపాటు జరిగిందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదీ ఏమైనా అనుకోకుండా తమ ఖాతాల్లోకి క్రికెట్ అయిన వారు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. మిగతా వారు తమ బ్యాలెన్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటున్నారు. మరి మీరు కూడా జీ పే యూజర్లు అయితే చెక్ చేసుకోండి..