
Couple Sleep : ప్రస్తుత కాలంలో అంతా యాంత్రిక జీవితంలా మారిపోయింది. ప్రతి దాన్ని వేగంగా చేసే క్రమంలో మన వ్యక్తిగత జీవితం గురించి పట్టించుకోవడమే మానేశాం. దీంతో సంసారంలో కలతలు రావడం జరుగుతుంది. ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య శృంగార సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీనిపై అమెరికాలో వన్ పోల్ సంస్థ నిర్వహించిన సర్వేలో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయి.
పని ఒత్తిడే..
దంపతుల శృంగారానికి అడ్డుగా ఉంటున్నవి ఏంటి? అనే దానిపై ఆరా తీస్తే చాలా మంది పని ఒత్తిడే కారణమని చెబుతున్నారు. దీంతో జీవిత భాగస్వామితో సరిగా ఉండలేకపోతున్నామని వివరించారు. రాత్రి నిద్ర కూడా ముఖ్యమే. శృంగారంలో పాల్గొనాలంటే ఎంతో కొంత సమయం కేటాయించాల్సి వస్తుంది. దీంతో నిద్రాభంగం కలుగుతుంది. దాని ప్రభావం మరుసటి రోజుపై పడుతుందనే ఉద్దేశంతోనే శృంగారానికి నో చెబుతున్నట్లు సర్వే వెల్లడించింది.
పిల్లల ప్రభావం
ఇంకా కొందరు పిల్లల ప్రభావం ఉందని తేల్చారు. పిల్లలు తమతోనే పడుకోవడంతో ఆ పని సాధ్యం కావడం లేదని చెప్పడం గమనార్హం. ఒకవేళ శృంగారంలో పాల్గొంటే వారు చూస్తారనే భయం కూడా వారిని వెంటాడుతోంది. దీని వల్ల తాము సరిగా శృంగారంలో పాల్గొనలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకు ఇలా..
శృంగారానికి ఎందుకు దూరంగా ఉంటున్నారు? దీని వల్ల వారి మానసిక స్థితి దెబ్బతింటోంది. వైద్యులు కూడా చెబుతున్నారు వారంలో కనీసం రెండు మూడు సార్లయినా శృంగారంలో పాల్గొంటేనే మానసికంగా దృఢంగా ఉంటారని చెబుతున్నారు. దీంతో శృంగారమనే కార్యానికి వీలు కాకపోవడంతో వారు కూడా సతమతమవుతున్నారు. ఆలుమగల బంధంలో శృంగారంతోనే మంచి లాభం ఉంటుంది.