Ram Charan's Daughter Photo
Ram Charan’s Daughter : రామ్ చరణ్-ఉపాసన చాలా ఆలస్యంగా ఫ్యామిలీ ప్లాన్ చేశారు. వివాహమైన పదేళ్లకు ఓ బిడ్డను కన్నారు. ఏళ్ళు గడుస్తున్నా రామ్ చరణ్, ఉపాసన గుడ్ న్యూస్ చెప్పడం లేదని అభిమానులు ఆవేదన చెందారు. ఈ క్రమంలో రామ్ చరణ్, ఉపాసన విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. కాగా 2022లో చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఉపాసన తల్లైన విషయం బయటపెట్టారు. ఈ న్యూస్ మెగా ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తింది. 2023 జులై 20న ఉపాసన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఈ పాపకు క్లిన్ కార అని పేరు పెట్టారు. లలితా సహస్ర నామం నుండి ఈ పేరు తీసుకున్నట్లు చిరంజీవి వెల్లడించారు. క్లిన్ కార పుట్టాక వారి కుటుంబంలో అనేక శుభాలు జరిగాయి. కాగా క్లిన్ కార వయసు ఏడాది దాటిపోయింది. అయినా ఇంత వరకు కిన్ కార ఫోటోను రివీల్ చేయలేదు. పబ్లిక్ లోకి వచ్చినప్పుడు క్లిన్ కార ముఖం కనిపించకుండా రామ్ చరణ్, ఉపాసన దంపతులు జాగ్రత్తపడేవారు. అయితే ఎట్టకేలకు క్లిన్ కార ఫోటోను ఉపాసన షేర్ చేసింది.
అపోలో ఆసుపత్రిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పవిత్రోత్సవాలు జరుగుతున్నాయట. కామినేని కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఉపాసన తండ్రి, తాతయ్య, బామ్మలు గుడిలో దేవుడికి నమస్కరిస్తున్న ఫోటో ఉపాసన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలో ఉపాసన తండ్రి క్లిన్ కారను ఎత్తుకుని ఉన్నారు. క్లిన్ కార లుక్ ఆ విధంగా బయటకు వచ్చింది. తాతయ్య, ముత్తాత, బామ్మలతో ఉపాసనను చూస్తుంటే నా బాల్యం గుర్తుకు వస్తుందని… ఉపాసన కామెంట్ చేసింది.
బంగారు, వెండి రంగు గౌనులో క్లిన్ కార చాలా క్యూట్ గా ఉంది. అభిమానులు వరుస కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. మా అన్నయ్య చరణ్ కుమార్తె సూపర్ అంటూ తమ అభిమానం చాటుకుంటున్నారు. క్లిన్ కార కోసం ఇంట్లో ప్రత్యేక గదిని నిపుణులతో సిద్ధం చేయించింది ఉపాసన. అలాగే క్లిన్ కార కేర్ టేకర్ కి లక్షల రూపాయల జీతం ఇస్తున్నారట.