https://oktelugu.com/

Balayya and Sai Dharam Tej : బాలయ్య కి చుక్కలు చూపించడానికి సిద్దమైన సాయి ధరమ్ తేజ్..ఇంత సాహసం ఏ హీరో కూడా చెయ్యలేరేమో!

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ఏ రేంజ్ ఫామ్ లో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వరుస ఫ్లాప్స్ తో డీలాపడిన ఆయనకి 'అఖండ' చిత్రం కొత్త ఊపిరి ని ఇచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 13, 2024 / 09:09 AM IST

    Balayya

    Follow us on

    Balayya and Sai Dharam Tej : ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ఏ రేంజ్ ఫామ్ లో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వరుస ఫ్లాప్స్ తో డీలాపడిన ఆయనకి ‘అఖండ’ చిత్రం కొత్త ఊపిరి ని ఇచ్చింది. ఈ సినిమా తర్వాత బాలయ్య ఆలోచన విధానం మొత్తం మారిపోయింది. ప్రస్తుత తరానికి తగ్గట్టుగా యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తూ, హిట్టు మీద హిట్టు కొడుతూ, నేటి తరం స్టార్ హీరోలకు పోటీని ఇచ్చే రేంజ్ కి తన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి బాలయ్య ఇప్పుడు ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నాడు. కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాకి, అందులోనూ జనాలు ఎంతో ఇష్టపడే క్యారక్టర్ కి సీక్వెల్ అంటే అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తారు. ఇటీవలే పూజా కార్యక్రమాల ద్వారా మొదలుపెట్టిన ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొన్ననే మొదలైంది. వచ్చే ఏడాది విజయదశమి కానుకగా సెప్టెంబర్ 25న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టుగా నిర్మాతలు అధికారిక ప్రకటన చేసారు.

    అయితే ఇదే తేదీన సాయి ధరమ్ తేజ్ తన కొత్త సినిమా ‘సంబరాల యేటి గట్టు’ అనే చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు నిన్న అధికారిక ప్రకటన చేసారు మేకర్స్. ‘అఖండ 2’ వంటి క్రేజీ ప్రాజెక్ట్ కి ఎదురు వెళ్లడం అనేది మామూలు సాహసం కాదు. బయ్యర్స్ కనీసం మరో సినిమాకి థియేటర్స్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉంటాయి. అలాంటి సినిమాకి ఎదురుగా వెళ్లేందుకు సాయి ధరమ్ తేజ్ సిద్దమయ్యాడు అంటే చిన్న విషయం కాదు. కచ్చితంగా తన సినిమా కంటెంట్ మీద బలమైన నమ్మకం ఉంటే తప్ప, తన కెరీర్ లో ప్రెస్టీజియస్ గా తీసుకున్న ఇలాంటి చిత్రాన్ని పోటీ కి దింపరని అంటున్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని కూడా నిన్న విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

    సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ చిత్రం లో హీరోయిన్ గా తమిళ నటి ఐశ్వర్య లక్ష్మి నటిస్తుంది. ఈమెకి ఇదే తొలి తెలుగు సినిమా. ఇదంతా పక్కన పెడితే గతం లో సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ‘ప్రతీ రోజు పండగే’, అదే విధంగా బాలయ్య హీరో గా నటించిన ‘రూలర్’ చిత్రాలు ఒకే రోజున విడుదల అయ్యాయి. రూలర్ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అవ్వగా, ‘ప్రతి రోజు పండగే’ చిత్రం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. మళ్ళీ అదే సీన్ రిపీట్ అవ్వబోతుందా?, సాయి ధరమ్ తేజ్ బాలయ్య పై మళ్ళీ విజయం సాధిస్తాడా?, లేకపోతే బాలయ్య సాయి ధరమ్ తేజ్ పై విజయం సాధించి పగ తీర్చుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.