Prashanth Varma
Prashanth Varma : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక దర్శకుల విషయానికి వస్తే యంగ్ డైరెక్టర్స్ కూడా తమ దైన రీతిలో సత్తా చాటుకోవాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నారు. మరి వాళ్ళు చేస్తున్న సినిమాలతో ఎలాంటి సక్సెస్ ను సంపాదించుకుంటారు. తద్వారా ఎలాంటి అవకాశాలు వస్తాయనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…
ప్రశాంత్ వర్మ ప్రస్తుతం పాన్ ఇండియాలో తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇప్పటికే హనుమాన్ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఆయన తన తదుపరి సినిమాతో కూడా భారీ విజయాలను అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన ‘దేవకి నందన వసుదేవ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాకి కథను అందించిన ఆయన అందులో పెద్దగా కొత్తదనం ఏమీ లేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది. మరి ఇప్పుడు ఆయన కెరియర్ మీద భారీగా ఎఫెక్ట్ పడుతున్నట్టుగా తెలుస్తోంది. దాంతో ఆయన మోక్షజ్ఞతో చేయాల్సిన సినిమా కూడా ఉంటుందా ఉండదా అని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇప్పటికే బాలయ్య బాబు ప్రశాంత్ వర్మ ను మార్చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే మన దర్శకత్వంలో వచ్చే సినిమాలను చేసుకుంటూ ముందుకు వెళ్లాలి.
కానీ కథలు ఇవ్వడం సినిమాలను ప్రొడ్యూస్ చేయడం లాంటి సైడ్ దందాలు పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అంటూ ప్రశాంత్ వర్మ చాలామంది హేళన చేస్తూ మాట్లాడుతున్నారు నిజానికి ప్రశాంత్ వర్మ ను కూడా ఇలాంటి సైడ్ బిజినెస్ లను పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు.
ఆయనకు ఒక్క సినిమాకి దాదాపు 50 నుంచి 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఈ సైడ్ బిజినెస్ లు పెట్టుకొని తన ఇమేజ్ ను పాడు చేసుకోవడం ఎందుకు అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలని తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే బాలయ్య బాబు మోక్షజ్ఞ సినిమా కోసం ప్రశాంత్ వర్మను మార్చాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది… మరి ప్రశాంత్ వర్మ ఈ విషయం మీద ఎలా స్పందిస్తాడు బాలయ్య బాబు మోక్షజ్ఞ డైరెక్షన్ లోనే ఇంట్రడ్యూస్ చేస్తాడా లేదంటే ఇతర దర్శకుల వైపు ముగ్గు చూపించే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది.
మరి మొత్తానికి అయితే ప్రశాంత్ వర్మ పాన్ ఇండియాలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కాబట్టి ఆయన డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తేనే బాగుంటుందని భావించిన బాలయ్య ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకోవడం వెనక అసలు కథ ఏంటి అనేది తెలియడం లేదు…ఇక ఆయనను మారిస్తే మళ్ళీ ఏ డైరెక్టర్ తో మోక్షజ్ఞ సినిమా ఉండచ్చు అని అందరూ అనుకుంటున్నారు…