UP Government Teacher: తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు గురువులే దైవం. ఒక రకంగా ఒక సమాజం బాగుపడాలంటే అది కచ్చితంగా గురువుల మీద ఆధారపడి ఉంటుంది. నడవడిక, క్రమశిక్షణ, చదువు, తోటివారి పట్ల గౌరవ మర్యాదలు.. ఇవన్నీ కూడా గురువుల బోధనతోనే పిల్లలకు తెలుస్తాయి. అందువల్లే ఎవరైనా పిల్లలు తప్పు చేస్తే ముందుగా నీకు చదువు చెప్పింది ఎవరు? అనే ప్రశ్న అడుగుతుంటారు. ఆ సమయంలో తల్లి పేరు అడగరు, తండ్రి పేరూ అడగరు. నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలోనూ గురువుకు ఈ స్థాయిలో మర్యాద ఉందంటే దానికి కారణం ఆ స్థానానికి ఉన్న గౌరవమే. అందుకే గురువును విష్ణు, బ్రహ్మ, మహేశ్వరులతో పోల్చారు. గురువు లేని చదువు వ్యర్ధమని, గురువు సాంగత్యంలో జీవితం సార్థకమని అంటారు.. కానీ ఇంతటి గొప్ప పేరున్న గురువు స్థానానికి ఓ మహిళ టీచర్ కళంకం తీసుకొచ్చింది..
Also Read: ఫ్రిజ్ లో పెట్టిన మటన్ తిని చనిపోయాడు.. డేంజర్ లో ఏడుగురు..
అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. అక్కడ ముందుఖేడ ప్రాంతంలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో శిశు నుంచి ఐదో తరగతి వరకు పాఠాలు చెబుతుంటారు. ఆ పాఠశాలలో ఓ తరగతి గదికి టీచర్ వెళ్ళింది. ఆ విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన సమయంలో ఆమె మరో పని చేసింది. చేతిలో ఉన్న డబ్బాను బయటకు తీసింది. జుట్టుకు ఉన్న బ్యాండ్ తీసింది. తర్వాత డబ్బాలో ఉన్న కొబ్బరి నూనె మొత్తం తన జుట్టుకు పట్టించడం ప్రారంభించింది. దువ్వెనతో జుట్టును దూకుడు మొదలుపెట్టింది. అంతేకాదు జుట్టు హిందీలో పాటలు వినడం మొదలు పెట్టింది. అయితే ఈ దృశ్యాన్ని అక్కడ ఉన్న కొంతమంది వీడియో తీశారు. దీనిని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఈ వీడియో అక్కడి వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొట్టడం మొదలుపెట్టింది. దీంతో ఆ మేడం గారి భాగోతం బయటపడింది. ఈ విషయం కాస్త ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు తెలియడంతో వారు తీవ్రంగా స్పందించారు. వెంటనే సదరు ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఆ పాఠశాలలో ప్రాథమిక స్థాయి విద్యాబోధన జరుగుతుంది. పైగా పిల్లలు కూడా తక్కువగా ఉంటారు. అందువల్లే ఆమె ఇలా ప్రవర్తించి ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆ ఉపాధ్యాయురాలు పాఠశాలకు సక్రమంగా రాదని.. విద్యార్థులకు పాటలు సరిగ్గా బోధించదని.. పాఠశాల నిర్వహణ సమయంలో ఇలా వ్యవహరిస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఇన్నాళ్లకు ఆమెకు సరైన శిక్ష పడిందని.. ఇకపై ఇలా వ్యవహరించే ఉపాధ్యాయులు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారని.. సక్రమంగా విధులు నిర్వహిస్తారని.. ప్రభుత్వ జీతం తీసుకుంటూ సమర్థవంతంగా పనిచేస్తారని స్థానికులు చెబుతున్నారు. ఇంత జరిగినప్పటికీ ఆ ఉపాధ్యాయురాలి లో ఏమాత్రం పశ్చాత్తాపం లేకపోవడం విశేషం.