Food Poisoning In Vanasthalipuram: నేటి కాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ తప్పనిసరిగా ఉంటుంది. రిఫ్రిజిరేటర్ చల్లని పానీయాలు విలువ ఉంచేందుకు.. ఆహార పదార్థాలను నిల్వ ఉంచేందుకు ఉపయోగపడుతుంది. కొన్ని ఆహార పదార్థాలను రోజుల తరబడి నిలువ ఉంచుకోవచ్చు. అయితే వాతావరణంలో మార్పుల వల్ల ఒక్కోసారి ఇలా నిల్వ ఉంచిన ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది అని ఇప్పటికే చాలామంది ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. తాజాగా అదే జరిగింది. ఫ్రిజ్లో నిల్వ ఉంచిన ఆహారాన్ని తినడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన 9 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒక మృతి చెందారు. అసలు ఫ్రిడ్జ్ లో ఉంచిన ఆహారాన్ని తినడం వల్ల ఎలా మరణించారు? అసలేం జరిగింది? ఫ్రిడ్జ్ లో మంచిగా ఆహారం ఎలా పాయిజన్ గా మారుతుంది?
Also Read: చివరి చిత్రంపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!
హైదరాబాదులోని వ్యవస్థలిపురం పరిధిలో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాస్ యాదవ్, రజిత అనే దంపతులకు జస్మిత లహరి అనే కూతుర్లు ఉన్నారు. అలాగే రజిత సోదరుడు సంతోష్ కుమార్, అతని భార్య రాధిక, కుమార్తెలు పూర్విక , కృతజ్ఞ, శ్రీనివాస్ యాదవ్ తల్లి గౌరమ్మ లు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారం తిని అస్వస్థకు గురయ్యారు. అయితే వీరిలో శ్రీనివాస్ యాదవ్ కు పరిస్థితి విషమించి మరణించారు.
బోనాల పండుగ సందర్భంగా ఆదివారం శ్రీనివాస్ యాదవ్ చికెన్, మటన్, బోటి కూరను తీసుకొచ్చారు. ఆదివారం వండుకున్న వీటిని మిగిలిన దానిని ఫ్రిజ్లో నిల్వ ఉంచారు. అయితే సోమవారం ఉదయం దీనిని వేడి చేసి తిన్నారు. ఇలా తినడంతో ఒకేసారి అందరికీ వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో సాయంత్రం సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలోకి వెళ్లారు. అయితే అందరికీ బ్లడ్ ప్రెషర్ పడిపోవడంతో ఐసీఈలోకి చేర్చారు. అయితే చికిత్స పొందుతూ శ్రీనివాస్ యాదవ్ మంగళవారం మృతి చెందారు. మిగతావారు చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి కూడా 24 గంటలు గడిస్తే గాని చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు.
ఫ్రిజ్లో నిల్వ ఉంచిన ఆహారం తినవద్దని ఇప్పటికే చాలామంది ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే కొందరు మాత్రం ఇలా నిల్వ ఉంచిన ఆహారాన్ని తిరిగి ఉదయం వేడి చేసి మరి తింటూ ఉంటారు. వీరు కూడా అలాగే తిన్నారు. ఎక్కువసేపు ఫ్రిజ్లో ఉంచిన ఆహారం లో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా ఉన్న ఆహారం వేడి చేయడం వల్ల విషం గా మారుతుంది. దీంతో దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో అనేక మార్పులు జరిగి అనారోగ్యానికి గురవుతారు. తాజాగా ఇలా తిన్న ఆహారంతో ఒకరి ప్రాణాలే పోయాయి. మరికొందరి ప్రాణాలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాయి. అందువల్ల ఫ్రిజ్లో నిల్వ ఉంచిన ఆహారాన్ని తిరిగి వేడి చేసి తినకుండా ఉండాలి. అంతేకాకుండా వర్షాకాలంలో ఇలాంటి ఆహారం తింటే అనారోగ్యం పాలు అయ్యే అవకాశం ఉంది. వర్షాకాలం మొత్తం వేడి చేసిన ఫ్రెష్ ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు..