Unstoppable With Nbk- Ntr And Kalyan Ram: ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ సీజన్ 2 రోజు రోజుకి ఎవ్వరూ ఊహించని విధంగా ప్రేక్షకాదరణ పొందుతోంది..ఇండియాలోనే బిగ్గెస్ట్ టాక్ షో గా అవతరించబోతోంది. మొదటి 5 ఎపిసోడ్స్ ఎలా ఉన్న చివరి మూడు ఎపిసోడ్స్ మాత్రం కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉండబోతున్నాయి.. ఇటీవలే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఈ షో కి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు..షూటింగ్ కూడా ఈమధ్యనే జరిగింది.. దానికి సంబంధించిన చిన్న ప్రోమో గ్లిమ్స్ కూడా విడుదల చేసారు.

ఎప్పుడెప్పుడు ఈ షో ప్రసారం అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు..డిసెంబర్ 31 వ తేదీన ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతున్నట్టు తెలిసింది..ఇప్పుడు ప్రభాస్ తర్వాత మరో క్రేజీ స్టార్ హీరో డేట్స్ ని పట్టేసింది ఆహా టీం..ఆ స్టార్ మరెవరో కాదు..మన పవర్ స్టార్ పవన్ కల్యాణే..చాలా కాలం నుండి పవన్ కళ్యాణ్ ఈ టాక్ షో చివరి ఎపిసోడ్ కి రాబోతున్నాడు అంటూ ఆహా ఇన్ డైరెక్టుగా వీడియోను షేర్ చేసింది. త్వరలోనే డేట్స్ చూసి చెప్తానని..షూటింగ్ సిద్ధం చేసుకోమని పవన్ కళ్యాణ్ ఆహా టీం కి చెప్పాడట.
సంక్రాంతి కానుకగా పవన్ కళ్యాణ్ పాల్గొనే ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..అప్పుడప్పుడు కొన్ని ఇంటర్వూస్ ఇవ్వడం తప్ప, ఎప్పుడూ ఇలాంటి టాక్ షోస్ పై ఆసక్తి చూపించని పవన్ కళ్యాణ్ వంటి స్టార్ ఇప్పుడు బాలయ్య బాబు షో కి రాబోతుండడం పెద్ద చర్చకి దారి తీసింది..పవన్ కళ్యాణ్ తో పాటుగా ఆయన చిరకాల మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హాజరు కాబోతున్నారట..ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఈ ఆనందం మరిచిపోకముందే బాలయ్య షోకు ఏకంగా అబ్బాయిలు ఇద్దరూ రావడం పెను సంచలనం అవుతోంది. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లు ఇదివరకెప్పుడూ సన్నిహితంగా ఉన్నది లేదు. తండ్రి హరికృష్ణ ఉన్నప్పుడు కూడా బాలయ్య వీరి కుటుంబంలో కలిసింది లేదు. జూ. ఎన్టీఆర్ ను బాలయ్య దూరం పెట్టాడని.. సహించడని ఒక ప్రచారం ఇండస్ట్రీలో ఉంది. కానీ వాటన్నింటికి చెక్ పెడుతూ బాలయ్య బాబు అన్ స్టాపబుల్ షోకు తాజాగా స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ తోపాటు కళ్యాణ్ రామ్ కూడా రాబోతున్నారట..

నందమూరి వారసులు ముగ్గురూ ఒకే చోట చేరితే అది ఫ్యాన్స్ కు కన్నుల పండువనే. బాబాయి బాలయ్యతో అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ షోలో సందడి చేస్తే షో రేటింగ్ ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయమంటున్నారు. చూడాలి మరీ ఈ సందర్భం ఎప్పుడొస్తుందో..