Unstoppable With NBK Pawan Kalyan: ఆహా మీడియా లో ఒక సాధారణ టాక్ షో గా ప్రారంభం అయ్యి నేడు ఇండియా లోనే నెంబర్ 1 టాక్ షో గా మారిపోయింది ‘అన్ స్టాపబుల్ విత్ NBK’..ఈ ఎపిసోడ్ ద్వారా బాలయ్య బాబు మొట్టమొదటిసారి మన ముందుకు వ్యాఖ్యాతగా వచ్చాడు..మొదటి సీజన్ బంపర్ హిట్ అయ్యింది..రెండవ సీజన్ అంతకు మించి సూపర్ హిట్ అయ్యింది..ఈ షో లో ఇప్పటి వరకు ఎంతో మంది సెలెబ్రిటీస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

కానీ ఈ సీజన్ లో మాత్రం యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు..వారిలో ఒకరు ప్రభాస్ కాగా , మరొకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ప్రభాస్ కి సంబంధించిన ఎపిసోడ్ ని నిన్ననే ఆహా లో స్ట్రీమింగ్ చెయ్యడం ప్రారంభించారు..రెస్పాన్స్ అదిరిపోయింది..మూడు రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ చేసారు..సంక్రాంతి కానుకగా ఈ ఎపిసోడ్ ఆహా లో స్ట్రీమింగ్ కాబోతుంది.
అయితే ఈ ఎపిసోడ్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కనీవినీ ఎరుగని రీతిలో అందరికి రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట..రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న కొన్ని ప్రముఖ థియేటర్స్ లో ఈ ఎపిసోడ్ ని ప్రదర్శించడానికి చూస్తున్నారట..పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ వల్ల ఈ షో ని చూడడానికి థియేటర్స్ కి ప్రేక్షకులు ఎగబడుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అదే కనుక జరిగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ వద్ద మరోసారి పండుగ వాతావరణం నెలకొంటుంది అనే చెప్పొచ్చు..పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఏ విషయమైనా అభిమానులు ఎలా సంబరాలు చేసుకుంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు..అలాంటిది ఆయన మొట్టమొదటి టాక్ షో లో పాల్గొంటే ఇక వాళ్ళ హడావడి ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు..అయితే ఈ ఎపిసోడ్ కి థియేటర్స్ లో టికెట్స్ ఉంటాయా..లేదా ఫ్రీ పాస్ అనేది తెలియాల్సి ఉంది.