Ram Charan- Prabhas: అభిమానులు మరియు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ప్రభాస్ ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ నిన్న రాత్రి 9 నుండి ఆహా మీడియా లో స్ట్రీమింగ్ అవుతుంది..ప్రభాస్ మొట్టమొదటిసారి అంత పెద్ద టాక్ షోలో పాల్గొనడం తో అందరూ ఎంతో ఆతృతగా ఈ ఎపిసోడ్ కోసం ఎదురు చూసారు..ఎప్పుడైతే ఈ ఎపిసోడ్ అప్లోడ్ అయ్యిందో లక్షలాది మంది ఒక్కేసారి ఆహా యాప్ ని ఓపెన్ చేసారు.

దాంతో ఒక్కసారిగా ఆహా యాప్ సర్వర్ క్రాష్ అయ్యి ఆఫ్ లైన్ అయ్యింది..కాసేపటి తర్వాత ఆ సమస్య ని పరిష్కారించి మళ్ళీ లైవ్ చేసారు..ఇక ఈ ఎపిసోడ్ చూసిన ప్రతీ ఒక్కరు బాగా ఎంజాయ్ చేశారనే చెప్పొచ్చు..ఈ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలిచింది ప్రభాస్ రామ్ చరణ్ కి ఫోన్ కాల్ చెయ్యడం..రామ్ చరణ్ అతనిని సరదాగా ఆటపట్టించడం..ఈ ఎపిసోడ్ చూసేంత వరకు వీళ్లిద్దరి మధ్య అంత మంచి స్నేహం ఉండనే విషయం ఎవరికీ తెలియదు.
ముందుగా బాలయ్య బాబు రామ్ చరణ్ కి ఫోన్ చెయ్యమని ప్రభాస్ కి చెప్తాడు..ప్రభాస్ తన ఫోన్ నుండి రామ్ చరణ్ కి ఫోన్ చేసి ‘బాలయ్య ఇక్కడ అన్ స్టాపబుల్ షోలో నన్ను స్పాట్ లో ప్రశ్నలు అడిగి ఇరికించేసాడు..నిన్ను కూడా అడుగుతాడేమో..ఆయనకి ఇస్తున్నా’ అంటూ బాలయ్య కి ఫోన్ ఇస్తాడు ప్రభాస్..ఆ తర్వాత బాలయ్య రామ్ చరణ్ తో మాట్లాడుతూ ‘ప్రభాస్ ని ఏమి అడిగినా సిగ్గు పడిపోతున్నాడు..మెలికలు తిరుగుతున్నాడు..నువ్వైనా నిజం చెప్పాలి..మనోడికి ప్రస్తుతం ఉన్న రాణి పేరేంటి..శెట్టి తో ముగుస్తుందా..లేదా సనన్ తో ముగుస్తుందా’ అని అడుగుతాడు..అప్పుడు రామ్ చరణ్ ‘ త్వరలోనే ప్రభాస్ మన అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు సార్’ అని అంటాడు.

అప్పుడు ప్రభాస్ ‘ఒరేయ్ శాడిస్ట్..నన్ను ఇరికించకు పెద్ద పెద్ద పెంట అయ్యిపోతాది సోషల్ మీడియా మొత్తం మూడు రోజుల వరకు..ప్లీజ్’ అంటాడు..అప్పుడు రామ్ చరణ్ ‘ఏమి లేదు లేండి సార్..మొత్తం డ్రామా..పాపం మనోడికి నిజంగానే ఎవ్వరూ లేరు’ అని అంటాడు..ఇదంతా చూసే వాళ్లకి చాలా క్యూట్ గా అనిపిస్తుంది..ఈ ఎపిసోడ్ ఇప్పుడే మీరు ఆహా లో చూడొచ్చు.