Geetu Royal: బిగ్ బాస్ రివ్యూవర్ గా ఫేమస్ అయిన గీతూ రాయల్ సీజన్ 6లో పాల్గొన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో పిచ్చ పాపులారిటీ ఉన్న ఈ భామకు ఆ కోటాలో అవకాశం ఇచ్చారు. ఇక హౌస్లో గీతూ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. బిగ్ బాస్ రివ్యూవర్ గా ప్రతి సీజన్ క్షుణ్ణంగా పరిశీలించిన గీతూ మంచి ఆట తీరు కనబరిచింది. ప్రారంభంలో మూడు నాలుగు వారాలు గీతూదే హవా. కారణం మిగతా కంటెస్టెంట్స్ కి ఆట పట్ల ఎలాంటి అవగాహన లేదు. ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఎలా ఆడాలో గీతూ మిగతా కంటెస్టెంట్స్ కి నేర్పారు.

అందుకే బిగ్ బాస్ ఆమె చుట్టూ షో నడిపారు. వారాంతంలో వచ్చే హోస్ట్ నాగార్జున, ఇంట్లో బిగ్ బాస్ ఆమెను బాగా పొగిడేవారు. గీతూ యాటిట్యూడ్, మాట తీరు ప్రత్యేకంగా నిలిచింది. మొదటి రోజు నుండి గేమ్ ఎలా ఆడాలో ఒక ప్రణాళిక వేసుకొని హౌస్లో అడుగుపెట్టింది గీతూ. అందుకే ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. టైటిల్ కొట్టడమే టార్గెట్ గా బరిలో దిగిన గీతూ గేమ్, ఆమెకు తెలియకుండానే గతి తప్పింది. ఇంకా బాగా ఆడాలనే తపనలో నెగిటివిటీ మూటగట్టుకుంది.
పొగడ్తలకు పడిపోయిన గీతూలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఈ క్రమంలో 7,8 వారాల్లో ఆమె గేమ్ విమర్శల పాలైంది. ఆడియన్స్ కి విసుగు, కోపం తెప్పించింది. అనూహ్యంగా గీతూ 9వ వారం ఎలిమినేట్ అయ్యింది. ఎలిమినేషన్ డే గీతూ చిన్నపిల్లలా ఏడ్చేసింది. నేను వెళ్ళను… బయటకు పంపకండి సార్… అంటూ మారాం చేసింది. సిబ్బంది వచ్చి గీతూను ఇంటికి పంపాల్సి వచ్చింది. కాగా హౌస్లో ఉన్నప్పుడు గీతూ ప్రజాప్రతినిధి కావాలన్న కోరిక బయటపెట్టారు.

తాజా ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న మీడియా ప్రతినిధులు ఆమెను అడిగారు. రాజకీయాల్లోకి రావడం పక్కా అన్న గీతూ కొంచెం సమయం ఉంది అన్నారు. ప్రస్తుతం నాది చిన్న వయసు పాలిటిక్స్ పై అవగాహన రావాలి అన్నారు. పదవులపై తనకు ఆశ లేదని గీతూ చెప్పింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీలను గీతూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారట. ప్రజా సమస్యలు తీర్చే సమర్ధవంతమైన పార్టీలో తాను చేరుతానని గీతూ చెప్పారు. తన దృష్టిలో ప్రజలకు మంచి చేస్తున్న పార్టీలో చేరి సేవ చేస్తానని గీతూ పరోక్షంగా చెప్పారు.