Uttarakhand: కాలేజీ ఫీజు చెల్లించలేక ఓ లెక్చరర్ ను విద్యార్థి పెళ్లి చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఉత్తరాఖాండ్ రాష్ట్రానికి చెందిన ఆ వ్యక్తి కొంతమందితో అధ్యాపకులతో కలిసి ఓ కళాశాల నిర్వహిస్తున్నారు. ఆ కళాశాలకు మంచి పేరుంది. దీంతో ఆ విద్యార్థిని ఆ కళాశాలలో చేరింది. ఆమె తల్లిదండ్రులది పేదరిక నేపథ్యమైనప్పటికీ, తాము పడుతున్న ఇబ్బందులు తమ కూతురు పడొద్దని ఆ తల్లిదండ్రులు ఆ ప్రైవేట్ కాలేజీలో చేర్పించారు. కూలి పనులు మెండుగా దొరికినప్పుడు ఆ విద్యార్థిని ఫీజులు ఆ తల్లిదండ్రులు సక్రమంగానే చెల్లించారు. కానీ గత ఏడాది ఆ రాష్ట్రంలో తీవ్రమైన వరదలు వచ్చాయి. పంటలు మొత్తం కొట్టుకుపోయాయి. దీంతో ఆ తల్లిదండ్రులకు కూలి పనులు దొరకడం కష్టమైపోయింది. ఈ క్రమంలో ఆ విద్యార్థి కాలేజీ ఫీజు కట్టడం గగనమైపోయింది. కాలేజీ యాజమాన్యం ఫీజు గురించి అడిగినప్పుడల్లా ఏదో ఒక కారణాన్ని ఆ విద్యార్థి చెబుతోంది. ఇలా సాకులు విన్న ఆ కళాశాల యాజమాన్యం ఆమెను తరగతులకు హాజరు కానివ్వలేదు. దీంతో ఆ విద్యార్థిని అనూహ్య నిర్ణయం తీసుకుంది.
చూడ్డానికి అందంగా ఉన్న ఆ విద్యార్థిని.. ఉన్నఫలంగా ఒకరోజు పూలదండ తీసుకెళ్లి ఆ కళాశాల అధ్యాపకుడి మెడలో వేసింది.”మీరంటే నాకిష్టం. మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను.. మీతో నా జీవితం గడపాలనుకుంటున్నానని” చెప్పింది. ఈ పరిణమంతో ఆ అధ్యాపకుడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఆ తర్వాత తేరుకుని ఆ విద్యార్థినికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఆ విద్యార్థిని బెట్టు విడకపోవడంతో ఆధ్యాపకుడు చేసేదేం లేక అలాగే మిన్న కుండిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియ రాలేదు.
కాకపోతే ఆ విద్యార్థిని ఆధ్యాపకుడి మెడలో దండ వేసిన తాలుకూ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. “ప్రస్తుతం అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయని, ఈ కాలంలో కూడా అలాంటి ఫీజుల బాధ ఉందా? ” అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ” ఆ విద్యార్థిని పెళ్లి చేసుకోవడానికి, కాలేజీ ఫీజు చెల్లించకపోవడానికి కారణం ఏముంది? ఆమెకు నచ్చాడు కాబట్టి మెడలో దండ వేసింది. దీనిని ఫీజు చెల్లించలేదు అనే కోణంలో ఎందుకు చూస్తున్నారని” మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన వెనుక ఏం జరిగింది? ప్రస్తుతం ఏం జరుగుతోంది? అనే విషయంపై ఎవరూ క్లారిటీ ఇవ్వడం లేదు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Unable to pay the student fees she married the teacher instead
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com