Leopard Viral Video: ఓ తల్లి.. ఆమెకు నలుగురు కుమారులు.. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో విడిపోతారు. మధ్యలో ఒకరికి ఒకరు తారసపడినప్పటికీ గుర్తు పట్టరు. చివరికి అనేక నాటకీయపరిణామాలు జరిగిన తర్వాత కలుసుకుంటారు. విలన్ ను చితకబాది నలుగురు అన్నదమ్ములు కలుసుకుంటారు. ఈ మొత్తం వృత్తాంతంలో పాటలుంటాయి. ఫైట్లు ఉంటాయి. ప్రేమలు కూడా ఉంటాయి.. మధ్య మధ్యలో డ్రామా కూడా ఉంటుంది. చదువుతుంటే ఎప్పుడో పాతకాలంనాటి సినిమాలు గుర్తుకొస్తున్నాయి కదా. నిజ జీవితంలో ఇలాంటి అనుభవాలు చాలామందికి ఎదురవుతుంటాయి. మనుషులకి కాదు జంతువులకు కూడా ఇటువంటి అనుభవాలు ఉంటాయి. కావాలంటే ఈ స్టోరీ చదవండి.
అనగనగనగా 2020.. అది మహారాష్ట్ర ప్రాంతం.. అక్కడ ఒక పులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ పిల్లలు మొదట్లో తల్లితో పాటు తిరిగేవి. ఆ తర్వాత ఏమైందో తెలియదు కొద్ది రోజులకు తల్లితో పాటు వెళ్లిపోయాయి. ఆహార అన్వేషణ సాగించాయి. ఈ లోగానే అవి కాలక్రమంలో పెద్దగా మారాయి. ఈ నేపథ్యంలోనే సరిగ్గా నాలుగు సంవత్సరాల తర్వాత తన తల్లిని కలుసుకున్నాయి. సహజంగా పులులు పెద్ద పెరిగిన తర్వాత తమ బాల్యాన్ని మర్చిపోతాయి. కాకపోతే ఈ పులులు ఎందుకనో తమ తల్లిని కలుసుకున్నాయి. కాకపోతే అవి పుట్టిన మహారాష్ట్రలో కాదు.. ఆహార అన్వేషణలో భాగంగా ఆ పులులు ఏకంగా రాష్ట్రాలు దాటి వెళ్లిపోయాయి. జీవ వైవిధ్యానికి విస్తృతమైన పేరు పొందిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చేరాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అవి ఆశ్రయం పొందుతున్నాయి. అక్కడికి వచ్చిన తమ తల్లిని చూసి ఆ పిల్లలు ఎంతగానో మురిసిపోయాయి..
సరిగా మహారాష్ట్రలో ఆ పులులు జన్మించినప్పుడు.. అక్కడి సీసీ కెమెరాలలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. తల్లిపులి ముందు వెళ్తుండగా.. పిల్లలు దాని వెనక వెళ్లడం మొదలుపెట్టాయి. అయితే ఇందులో మొదటి మూడు చిన్న పిల్లలు తల్లిని అనుసరిస్తుండగా.. ఇంకో చలాకీ పులి వెనక వైపు ఉండి నక్కినక్కి చూస్తోంది. ఆ పులి వెళ్తుండగా.. నాలుగు పిల్లలు చూడముచ్చటగా దానిని అనుసరిస్తున్నాయి. ఈ దృశ్యం చూసేందుకు చాలా అద్భుతంగా ఉంది.
సాధారణంగా పులులు ఆహార అన్వేషణకు వెళ్ళినప్పుడు భయం భయంగా ఉంటాయి. ఎందుకంటే అప్పటికే అడవిలో ఇతర పులులు కూడా ఉంటాయి. వాటికి భౌగోళిక విభజన రేఖ అనేది ఉంటుంది. కొన్ని సందర్భాలలో భౌగోళిక విభజన రేఖను దాటిన పులులపై ఇతర పులులు దాడి చేస్తుంటాయి.. అయితే మహారాష్ట్ర నుంచి చిన్నపిల్లలుగా వెళ్లిన ఈ పులులు అదృష్టవశాత్తు ఎటువంటి దాడులకు గురి కాలేదు. ఆ తర్వాత అవి క్రమక్రమంగా వృద్ధి చెందాయి. చివరికి తన తల్లిని కలుసుకున్నాయి.. అంతే ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే అంటూ పాటలు కూడా పాడుకున్నాయి.. సాధారణంగా మనుషుల్లోనే డెస్టిని ఉంటుంది అనుకుంటాం. కానీ అది జంతువుల్లో కూడా ఉంటుందని.. చివరికి వాటిని కూడా కలుపుతుందని ఈ పులి, తన నాలుగు పిల్లల ద్వారా తెలిసింది.
A leopard with four cubs…
This one is from one of the most vibrant ecosystem of Utrakhand.
Litters of 4 are relatively uncommon.Two or three being typical.The last incident that comes to mind is of August 2020, when 4 cubs were reunited with mother at Igatpuri, Maharashtra. pic.twitter.com/DPN9JGqIEm— Susanta Nanda IFS (Retd) (@susantananda3) July 19, 2025