Uber Cab Driver: భారత దేశం సర్వ మతాల సమ్మేళనం. విదేశీయులు కూడా వివిధ పనుల నిమిత్తం వచ్చి భారత దేశంలో ఉంటున్నారు. పాకిస్తానీలు కూడా అనుమతితో మన దేశంలోని వివిధ రాష్ట్రాలో ఉన్నారు. ఎవరి పని వారు చేసుకుంటూ పోతున్నారు. ఇక మెట్రో నగరాలు అయిన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌లో నిత్యం అనేక ఘటనలు జరుగుతుంటాయి. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఓ పాకిస్థానీ పౌరుడు తన స్నేహితురాలితో క్యాబ్ ఎక్కాడు. మధ్యలో వచ్చాక ఆమెను ఇంపేశాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కారులో కూర్చున్న వ్యక్తి పాకిస్తాన్‌కు చెందినవాడు. క్యాబ్‌లో కూర్చున్న తర్వాత పాకిస్థాన్ వ్యక్తి స్నేహితురాలు క్యాబ్ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన భారతీయ క్యాబ్ డ్రైవర్ ఇద్దరినీ మధ్యలో దించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
భారత్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే.. క్యాబ్ డ్రైవర్ మొదట ఢిల్లీ, భారతీయుల గురించి మంచి మాటలు చెప్పాడు. కానీ, పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి వాటిపై నిరసన వ్యక్తం చేయడమే కాకుండా భరత్‌ను కించపరిచేలా మాట్లాడాడు. భారతీయులను గౌరవించకుండా మాట్లాడాడు. అతను భారతీయులను, ఢిల్లీ వాసులను స్వార్ధపరులు అని మాట్లాడాడు. ఈ క్రమంలో గొడవ పెరగడంతో చిర్రెత్తుకొచ్చిన క్యాబ్ డ్రైవర్ వాహనం పక్కన నిలిపి ఇద్దరినీ కిందకు దించేశాడు. అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
ఇది మోదీ దేశం…
ఈ సందర్భంగా క్యాబ్ డ్రైవర్ కూడా వారితో గట్టిగా వాదించాడు. ఇది నరేంద్రమోదీ దేశం.. పాకిస్తానీల బుద్ధి మారదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదు అని కఠినంగా మాట్లాడాడు. ఈ ఘటన ఢిల్లీలో ఎక్కడ, ఏరోజు జరిగిందో తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో వైరల్ అవుతోంది. రాత్రి పూట జరిగినట్లు మాత్రం అర్థం అవ్వుతుంది. రాత్రి వేళనే పాకిస్తానీయుడిని, అతని స్నేహితురాలిని మధ్యలో వదిలేసి వెళ్లాడు. అదే సమయంలో అతనికి సపోర్టుగా ఎవరైనా ఉండి ఉంటే పాకిస్తాన్ యువకుడి పరిస్థితి దారుణంగా ఉండేది. క్యాబ్ డ్రైవర్ సహనం వహించడంతోనే అతను బతికిపోయాడు. ఈ వీడియో చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు. డ్రైవర్‌కు సెల్యూడ్ చేస్తున్నారు. దటీజ్ ఇండియన్.. భారత్‌తో పెట్టుకుంటే అంతే మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. క్యాబ్ డ్రైవర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
A cab driver kicked passengers out of his taxi because they were abusing India.
Apparently an Indian leftist girl was sitting in his taxi with her Pakistani BF, they were continuously praising Pakistan & abusing India which he couldn’t tolerate.
Salute to him. We need more such… pic.twitter.com/6d5qgrtLeA
— Mr Sinha (@MrSinha_) August 11, 2024