https://oktelugu.com/

Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త

యువత, పిల్లలు ఎనర్జీ డ్రింక్స్ ను వెర్రిగా తాగుతున్నారు అంటారు కొందరు. ఒక ముక్కలో చెప్పాలంటే ప్రస్తుతం ఎనర్జీ డ్రింక్స్ ట్రెండ్ నడుస్తుంది. ఇవి తక్షణ శక్తిని అందిస్తుంటాయి. కానీ అవి ఆరోగ్యానికి హానికరమే అంటున్నారు నిపుణులు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : August 13, 2024 / 04:31 PM IST

    Energy Drinks

    Follow us on

    Energy Drinks: ఇప్పుడు చాలా రకాల పండ్లు, కూరగాయలు, జ్యూస్ లను ఆహారం కోసం, ఆరోగ్యం కోసం తినడం కంటే స్టేటస్ కోసం కూడా తినేవారు ఉన్నారు. గొప్పలు చూపించుకోవడానికి కూడా కొందరు డ్రింక్స్ ను ఎంచుకుంటున్నారు. వంద రూపాయలు పెట్టి టమాట కొంటే దాని వల్ల ఆరోగ్యమే. కానీ పక్కవారికి మేము కిలో టమాటాలు కొనుగోలు చేశామని చెప్పుకుంటారు. కొన్ని సార్లు ఇలాంటివి నిజంగానే జరుగుతున్నాయి. అయితే మెయిన్ గా ఎనర్జీ గురించి కూడా కొందరు గొప్పలకే తాగుతుంటారు. ఇదొక స్టేటస్ గా మారిపోయింది. అసలు వీటి వల్ల ప్రయోజనాలు ఉన్నాయా? లేదా? వీటికి బదులు ఎలాంటి డ్రింక్స్ చేయాలి అనే వివరాలు తెలుసుకుందాం.

    యువత, పిల్లలు ఎనర్జీ డ్రింక్స్ ను వెర్రిగా తాగుతున్నారు అంటారు కొందరు. ఒక ముక్కలో చెప్పాలంటే ప్రస్తుతం ఎనర్జీ డ్రింక్స్ ట్రెండ్ నడుస్తుంది. ఇవి తక్షణ శక్తిని అందిస్తుంటాయి. కానీ అవి ఆరోగ్యానికి హానికరమే అంటున్నారు నిపుణులు. చాలా మంది ఆరోగ్య నిపుణులు ఎనర్జీ డ్రింక్స్ విషయంలో గతంలో నుంచే హెచ్చరిస్తున్నారు.మరి ఈ ఎనర్జీ డ్రింక్స్ ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేస్తాయో తెలుసుకుందాం.

    ఎనర్జీ డ్రింక్స్ గుండెకు సంబంధించిన రక్త నాళాల మీద ప్రభావం చూపుతాయి అంటున్నారు నిపుణులు. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయట. గుండె కొట్టుకోవడంలో మార్పులు సంభవిస్తాయి. అంతేకాకుండా హార్ట్ స్ట్రోక్ కు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని రెగ్యూలర్ గా తీసుకునే నిద్ర లేమి సమస్య వస్తుందట. ఎనర్జీ డ్రింక్ మానసిక ఆరోగ్యానికి మంచిది కాదని.. దీనివల్ల టెన్షన్ పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. సో వీటికి దూరంగా ఉండటం బెటర్.

    ఎనర్జీ డ్రింక్స్‌లో ఉండే అధిక చక్కెర ఊబకాయం, టైప్-2 డయాబెటిస్ లకు కారణం అవుతుందట. తక్కువ pH స్థాయి, అధిక చక్కెర దంతాలను నాశనం చేస్తాయి. ఒకసారి వీటిని తాగితే పదేపదే తాగాలి అనిపిస్తుంటుంది. వీటికి అడెక్ట్ అవుతారు చాలా మంది. అందుకే నో ఎనర్జీ డ్రింక్స్ జస్ట్ అవైడ్ ఇట్. ఇక పెద్దలకు మాత్రమే కాదు. వీటిని పిల్లలకు కూడా అలవాటు చేశారు. మీ ఇంట్లో పిల్లలకు వీటిని అలవాటు చేస్తే వెంటనే అవైడ్ చేయడం మంచిది అంటున్నారు నిపుణులు.

    ఎనర్జీ డ్రింక్స్‌కు బదులు కొబ్బరి నీళ్లు వంటి సహజమైన ఆరోగ్యాన్ని పెంచే వాటిని తీసుకోవడం మంచిది. మీ ఆహారంలో కెఫిన్ చేర్చడం తప్పనిసరి అయితే చక్కెర లేకుండా తేలికపాటి కాఫీలను తీసుకోండి. ఇది కాకుండా ఆరోగ్యకరమైన పానీయాలను కూడా తీసుకోండి. ముఖ్యంగా ఆకుపచ్చ డ్రింక్స్ అంటే కూరగాయలు, పండ్ల వంటి జ్యూస్ లను తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ బదులు పాలు లేదా తాజా పండ్ల రసాలు ఇవ్వండి. వారి ఆరోగ్యానికి తోడ్పడతాయి. షర్బత్ కూడా ప్రోటీన్ కు గొప్ప మూలం. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది కాబట్టి మంచిని పెంచి చెడును కలిగించే వాటిని అవైడ్ చేయండి.