
Vinodhaya Sitham Remake: పవన్ కళ్యాణ్ వినోదయ సితం రీమేక్ సెట్స్ లో ఉన్నారు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. దర్శకుడు సముద్ర ఖని పవన్-సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ సన్నివేశాలు షూట్ చేశారు. మొదట పవన్ పార్ట్ పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ది ఈ చిత్రంలో ఎక్స్టెండెడ్ క్యామియో పాత్రలా ఉంటుంది. ఆయన కేవలం 25 రోజులు కేటాయించారని సమాచారం. పవన్ కళ్యాణ్ కి ఇతర చిత్రాల కమిట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి త్వరితగతిన వినోదయ సితం కంప్లీట్ చేసి విడుదల చేయాలనేది మేకర్స్ ప్లాన్. దాదాపు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాజెక్ట్ షూట్ జరగనుంది.
కాగా నేడు మూవీ క్యాస్ట్ ప్రకటించారు. హీరోయిన్స్ తో పాటు ఇతర తారాగణం వివరాలు వెల్లడించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారట. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. రొమాంటిక్ చిత్రంతో హీరోయిన్ గా మారిన కేతిక నాగ శౌర్యకు జంటగా లక్ష్య చిత్రం చేశారు. ఇది స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. అనంతరం మెగా ఫ్యామిలీ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన రంగ రంగ వైభవంగా చిత్రంలో హీరోయిన్ గా నటించారు. ఈ మూడు చిత్రాలు విజయం సాధించలేదు.
ఇక ప్రియా ప్రకాష్ వారియర్ కన్నుకొట్టే వీడియోతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. ఆమెకు చంద్రశేఖర్ ఏలేటి చెక్ మూవీలో ఆఫర్ ఇచ్చారు. నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ నిరాశపరిచింది. ఇద్దరు ప్లాప్ హీరోయిన్స్ కి ఎంపిక చేసి పవన్ షాక్ ఇచ్చారు. అయితే పవన్ గతంలో ఇలాంటి సాహసాలు చాలానే చేశారు. గబ్బర్ సింగ్ మూవీ నాటికి శృతి హాసన్ ఐరన్ లెగ్ ఇమేజ్ తో వరుస ప్లాప్స్ లో ఉన్నారు. అయినా ఆమె టాలెంట్ పై నమ్మకంతో ఆఫర్ ఇచ్చి దశ మార్చేశాడు. అక్కడ నుండి శృతి హాసన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

వకీల్ సాబ్ చిత్రంలో సైతం పెద్దగా ఫేమ్ లేని నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళకు ఆఫర్ ఇచ్చారు. ఫేడ్ అవుట్ దశలో ఉన్న వారి కెరీర్స్ కి వకీల్ సాబ్ ఎంతో కొంత మేలు చేసిందనడంలో సందేహం లేదు. కాగా ఈ చిత్రానికి దేవుడు అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఆగస్టులోనే విడుదల ఉంటుందని సమాచారం. సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే పవన్ హరి హర వీరమల్లు షూట్ పూర్తి చేస్తున్నారు. సాయి ధరమ్ నటించిన విరూపాక్ష విడుదలకు సిద్ధం అవుతోంది.
Presenting the cast of one of our most ambitious project #PKSDT 🤩
Pawankalyan
SaiDharamTej
Ketikasharma
Rohini
Brahmanandam
Tanikellabharani
Subbaraju
Priya prakash warier
Raja ChemboluStorming updates on the way💥🌀 pic.twitter.com/55TS3TazyN
— People Media Factory (@peoplemediafcy) February 28, 2023