
Mahesh And Prabhas: సినిమా అన్నాక ఏ పాత్ర అయినా చేయాల్సి ఉంటుంది. ప్రేక్షకులను మెప్పించేందుకు కష్టపడాల్సి ఉంటుంది. ఒకప్పుడు కొందరు హీరోలు, హీరోయిన్లు ఫాంలో ఉన్నప్పుడు డీ గ్లామర్ పాత్రలు చేయడానికి వెనుకడుగు వేసేవారు. ఇక హీరోయిన్లయితే హీరోయిన్ కాకుండా ఇతర పాత్రలు చేయడానికి అస్సలు ఇష్టపడలేదు. కానీ నేటి పరిస్థితుల్లో అవకాశాలు తగ్గిపోవడంతో పాటు ప్రత్యేకంగా నిలిచేందుకు ఎలాంటి పాత్రనైనా చేయడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా స్టార్ నటులుగా గుర్తింపు పొందిన ఇద్దరు హీరోలు తాత పాత్రల్లో నటించేందుకు సిద్ధమయ్యారు. ఒకప్పుడు హీరోగా, విలన్ గా మెప్పించిన వీరు ఇప్పుడు స్టార్ హీరోలకు తాతలుగా నటించడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.
మహేశ్, ప్రభాస్ టాలీవుడ్ క్రేజీ స్టార్స్. వీరి సినిమాలంటే లైక్ చేయని వారుండరు. మహేశ్ బాబు లెటేస్టుగా త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డె హీరోయిన్. ఇందులో శ్రీ లీల కూడా సెకండ్ ఫీమేల్ క్యారెక్టర్ గా నటిస్తోంది. మహేశ్, ప్రకాశ్ రాజ్ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అలాగే దూకుడు సినిమాలో తండ్రీ కొడుకులుగా కూడా నటించారు. అయితే SSMB28 లో ప్రకాశ్ రాజ్ మహేశ్ కు తాతగా కనిపించనున్నాడు.
అటు ప్రభాస్ వరుసబెట్టి సినిమాలు తీస్తున్నాడు. ప్రజెంట్ మారుతీ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ తాతగా కనిపించనున్నాడు. సంజయ్ దత్ రీసెంట్ గా కేజీఎప్ -చాప్టర్ 2లో మెయిన్ విలన్. కానీ ఇప్పుడు ప్రభాస్ కు తాతగా నటించడం ఆసక్తిగా మారింది. దీంతో వీరు వయసుకు తగ్గట్లు పాత్రలు కూడా ఆ రకంగా మారుతున్నాయని అంటున్నారు.

అయితే వీరు తాతలుగా నటించినా కీలక రోల్ ఇస్తారని అంటున్నారు. త్రివిక్రమ్ తీసే ప్రతీ సినిమాలో ఓ తాత ఉంటారు. ఆయనే కీలకమవుతాడు. ఇప్పుడు మహేశ్ సినిమాలో అదే చేస్తారని అంటున్నారు. కానీ అఫీషియల్ గా మాత్రం ఈ ప్రకటన రాలేదు. ఇక ప్రభాస్ సినిమాలో సంజయ్ దత్ ను తాత గా ఎందుకు పెట్టారో తెలియదు. ఏమైనా ఈ విషయాలు అదికారికంగా ప్రకటించే వరకు డిసైడ్ కావొద్దని సినీ ప్రియులు అంటున్నారు.