Florida: చూస్తుండగానే విమానం కుప్పకూలింది.. ఇద్దరు చనిపోయారు..వైరల్ వీడియో

బొంబార్డియర్ చాలెంజర్ 600 రకానికి చెందిన బిజినెస్ జెట్ విమానం ఐదుగురు ప్రయాణికులతో యూనివర్సిటీ విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ అయ్యింది. అక్కడి నుంచి రెండు గంటల పాటు ప్రయాణం చేసింది.

Written By: Suresh, Updated On : February 11, 2024 7:04 am

Florida

Follow us on

Florida: అది అమెరికాలోని ఫ్లోరిడా. శీతాకాలం కావడంతో సూర్యుడు జాడ అంతందమాత్రంగానే ఉంది. పైగా అది అది హైవే రోడ్డు. జన సంచారం ఎక్కువగా లేదు. ఈలోపు రయ్యిమంటూ ఒక విమానం దూసుకొచ్చింది. అది యుద్ధ విమానం అని అక్కడున్న వాళ్లు అనుకున్నారు. కానీ చూస్తుండగానే దాని ఇంజన్లు ఫెయిల్ అయ్యాయి. అదే సమయంలో మంటలు చెలరేగాయి. ఫలితంగా ఆ విమానం కాలిపోయింది. ఆ మంటల్లో ఇద్దరు చనిపోయారు.

బొంబార్డియర్ చాలెంజర్ 600 రకానికి చెందిన బిజినెస్ జెట్ విమానం ఐదుగురు ప్రయాణికులతో యూనివర్సిటీ విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ అయ్యింది. అక్కడి నుంచి రెండు గంటల పాటు ప్రయాణం చేసింది. అయితే విమానం గాల్లో ఉన్నప్పుడు రెండు ఇంజన్లు ఫెయిల్ అయ్యాయని పైలెట్ గుర్తించాడు. ఈ నేపథ్యంలో ఫ్లోరిడా లోని నేపుల్స్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ కోసం అభ్యర్థించాడు. అక్కడి విమానాశ్రయ అధికారులు అతనికి ఒకే చెప్పారు. కానీ అప్పటికే పరిస్థితి అదుపుతప్పింది. ఇంజన్లు ఫెయిల్ కావడంతో ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్ కు సహకరించలేదు. దీంతో అదుపుతప్పి ఆ విమానం ఫ్లోరిడా హైవేపై కుప్పకూలిపోయింది. విమానంలో ఇంధనం అధికంగా ఉండటంతో మంటలు విపరీతంగా వ్యాపించాయి. రెస్క్యూ, ఫైర్ కంట్రోల్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. తీవ్రంగా శ్రమించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే ఆ విమానంలో ఐదుగురు ప్రయాణిస్తుండగా.. ఇద్దరు కన్నుమూశారు. ఈ విషయం తెలియడంతో స్థానిక పోలీసులు అక్కడికి వచ్చారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దర్యాప్తు చేపడుతున్నాయి. విమానం కూలినప్పుడు స్థానికులు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో విమానం కూలిన తాలూకు దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి. ఆ విమానం కూలినప్పుడు భారీ శబ్దం వచ్చిందని, ఏం జరుగుతుందో అనుకుంటుండగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులు అంటున్నారు. విమానంలో వ్యాపించిన మంటల ధాటికి కనీసం అటువైపు వెళ్దామన్నా కూడా ధైర్యం సరిపోలేదని వారు వాపోయారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు ప్రయాణికులు చనిపోయిన నేపథ్యంలో వారి మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు..