spot_img
Homeట్రెండింగ్ న్యూస్Karnataka: ఆపరేషన్ థియేటర్లో ప్రీ వెడ్డింగ్ షూటా? పిచ్చి పీక్స్ కి వెళ్ళడం అంటే ఇదే?...

Karnataka: ఆపరేషన్ థియేటర్లో ప్రీ వెడ్డింగ్ షూటా? పిచ్చి పీక్స్ కి వెళ్ళడం అంటే ఇదే? వైరల్ వీడియో

Karnataka: జిహ్వకో రుచి. పుర్రెకో బుద్ధి అంటారు. ఆ పుర్రెలో బుద్ధి సక్రమంగా ఉంటే అన్ని బాగానే జరుగుతాయి. కానీ ఆ ఆలోచనలు వక్రమార్గం పడితేనే తేడా వస్తుంది. అలాంటిదే ఈ సంఘటన కూడా. ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో వీరు చేసిన తతంగం అంతా ఇంతా కాదు. ఫలితంగా ఓ ప్రభుత్వ డాక్టర్ సస్పెండ్ అయ్యాడు.

సాధారణంగా ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ ను దేనికోసం వాడతారు? మీకేమైనా మైండ్ దొబ్బిందా? ఆపరేషన్ థియేటర్ దేనికి వాడటం ఏంటి అంటారా? మీరు సంధించిన సందేహంలో న్యాయం ఉంది. కానీ వీరు చేసిన పని చూస్తే మీరు కచ్చితంగా మాలాగే అదే ప్రశ్న అడుగుతారు. ఎందుకంటే ఒక డాక్టర్ తనకు కాబోయే భార్యతో కలిసి ఆపరేషన్ థియేటర్లో ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించాడు. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. బెంగళూరు ప్రాంతంలోని ఒక డాక్టర్ కు ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. మరికొద్ది రోజుల్లో వివాహం జరగనుంది. ప్రస్తుతం సాంకేతికత పెరిగిన నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ షూట్లు అనేవి సర్వసాధారణమైపోయాయి. అయితే ఈ డాక్టర్ కూడా తనకు కాబోయే భార్యతో కలిసి ఆపరేషన్ థియేటర్ లో ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించాడు. తనకు కాబోయే భార్యతో కలిసి మాకు ఆపరేషన్ చేస్తున్నట్టు నటించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతోంది. అయితే ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆ వైద్యుడిని సస్పెండ్ చేసింది.

కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా భర్మసాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. ఈ ఆస్పత్రిలో అభిషేక్ అనే వైద్యుడు కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నాడు. ఇటీవల అతడికి వివాహం కుదిరింది. త్వరలో అతడికి పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో అన్నిటికంటే భిన్నంగా ఉండాలని అభిషేక్ తనకు కాబోయే భార్యతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లో ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించాడు. ఈ షూట్లో భాగంగా ఓ వ్యక్తికి సర్జరీ చేస్తున్నట్టు అభిషేక్ నటించాడు. కాబోయే భార్య అతనికి సహకరిస్తున్నట్టు.. అతడి మొదటి పై పట్టిన చెమటను దూదితో తుడుస్తున్నట్టు నటించింది. అయితే ఈ వ్యవహారం మొత్తాన్ని చూసిన సర్జరీలో పాల్గొన్న రోగి ఒక్కసారిగా పైకి లేస్తాడు. ఒక నవ్వు నవ్వి తిరిగి పడుకుంటాడు. దీంతో డాక్టర్ అభిషేక్, అతడికి కాబోయే భార్య, ఆపరేషన్ థియేటర్లో ఉన్న లైటింగ్ ఫోటో, వీడియో షూటింగ్ సిబ్బంది ఒక నవ్వు నవ్వి ఊరుకుంటారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో సర్కులేట్ కావడంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. డాక్టర్ అభిషేక్ ను సస్పెండ్ చేసింది. ఇక డాక్టర్ అభిషేక్ ఆపరేషన్ థియేటర్లో ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండురావు ఈ వ్యవహారంపై స్పందించారు. ఆ వైద్యుడిని విధుల నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లను రోగుల సేవ కోసం వినియోగించాలి.. అంతేగాని వెడ్డింగ్ షూట్ లకు వాడకూడదని ఆయన హెచ్చరించారు. గతంలో కేరళ రాష్ట్రంలో జంట మురికి గుంతలో ఫోటోషూట్ నిర్వహించి అబాసుపాలయ్యారు. తాజాగా డా. అభిషేక్ ఆపరేషన్ థియేటర్లో ప్రీ వెడ్డింగ్ షూట్ జరిపి ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు.

 

Doctor’s Pre-wedding Shoot At Govt Hospital Operation Theater Draws Flak | Public TV English

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version