Time Traveler: పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మన భవిష్యత్ పై ఎన్నో విషయాలు చెప్పాడు. ఆయన సూచించినవి చాలా వరకు జరిగాయి. మనుషుల్లో వస్తున్న ప్రవర్తనతో లోకం తీరు మారుతుందని ఆనాడే చెప్పడం విశేషం. అందుకే ఆయనను కూడా కమ్యూనిస్టుగానే అభివర్ణించారు. కలియుగంలో జరిగే వింతలు, విశేషాలను ఆనాడే ఊహించి చెప్పి మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడేలా చేసినా మనం పట్టించుకోవడం లేదు. కాలజ్ణానం పేరుతో ఆయన రాసిన విషయాలు అక్షర సత్యాలుగా మారుతున్నాయి.

ఇదే కోవలో ఏరీ యోర్మనీ అనే వ్యక్తి ఎస్టిటిక్ టైమ్ వార్నెర్ పేరుతో అకౌంట్ నిర్వహిస్తున్నాడు. అతడికి 12 లక్షల మంది అనుచరులున్నారు. అతడు భవిష్యత్ గురించి తేదీలతో సహా జరిగే విషయాల గురించి వివరించడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అతడు పోస్టింగ్ చేసిన వీడియోలతో అందరిలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్నింటికి వీడియోలు, మరికొన్నింటికి టెక్ట్స్ రూపంల సందేశాలు పెట్టాడు. తనను తాను నిజమైన టైమ్ ట్రావెలర్ గా చెప్పుకుంటున్నాడు. భవిష్యత్ లో ఏం జరుగుతుందనే దానిపై తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు.
14 మార్చి 2023న 1800 అడుగుల ఎత్తు ఉండే మెగా సునామీ రాబోతుందని వివరించాడు. అమెరికా, కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోపై దీని ప్రభావం ఉంటుందని చెబుతున్నాడు. దీని వల్ల చాలా ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవిస్తుందని చెప్పాడు. దాదాపు ఐదు లక్షల మంది చనిపోతారని తెలిపాడు. గతంలో కూడా సునామీ వచ్చిన సంగతి విధితమే. ఇప్పుడు యోర్మనీ చెబుతున్న వాటిలో నిజమెంత? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సునామీ ముప్పు ఉంటుందా? అనే కోణంలో అందరు పరిశోధిస్తున్నారు.
11 మే 2023న వోజిక్స్ అనే గ్రహాంతరవాసులు భూమిపై వాలుతారు. వారు భూమిపై పెత్తనం చెలాయిస్తారు. అన్ని దేశాల్లో ప్రభుత్వాలను తమ చెప్పుచేతల్లో ఉంచుకుంటారు. అన్ని దేశాలను తమ ఆధీనంలోకి తీసుకుంటారు. దీంతో భూమిపై వారి ప్రాబల్యం పెరుగుతుంది. వారి ఆగడాలు పెరుగుతాయి. మానవులపై వారు చూపే కర్కశత్వంపై అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. 27 జూన్ 2023న గ్రహాంతర వాసులకు చెందిన స్పేస్ షిప్ భూమిపై వాలుతుంది. అందులో గ్రహాంతర వాసులు వారి వస్తువులు ఉంటాయి.

6 నవంబర్ 2023న పసిఫిక్ మహా సముద్రంలో పెద్ద జీవిని కనుగొంటారు. ఇది నీలి తిమింగలం కంటే 3 రెట్లు పెద్దగా ఉంటుంది. 2 జనవరి 2024న కాలిఫోర్నియాలో 9.9 తీవ్రత గల భూకంపం వస్తుంది. దీని ప్రభావంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు. కాలిఫోర్నియా సముద్రంలో మునిగిపోతుందని వివరిస్తున్నాడు. మొత్తానికి అతడు తేదీలతో సహా జరిగే ఉత్పాతాల గురించి తెలియజేయడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈ వీడియోకు 20 వేల మంది లైకులు కొట్టారు.
యూజర్లు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజమా? అభూత కల్పనా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇవి జరగకూడదని కొందరు ట్వీట్ చేస్తుంటే మూడేళ్లుగా ఏలియన్స్ వస్తున్నారని చెబుతున్నావని ప్రశ్నిస్తున్నారు. ఇవి కేవలం అంచనాలు మాత్రమే నిజాలు కావని మరికొందరు తమ వాదన వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడు చేసిన పోస్టుపై అందరిలో ఆలోచనలు కలుగుతున్నా అందులో వాస్తవం లేదని చెబుతున్నారు.