Tollywood Heroine Affair: చిత్ర పరిశ్రమలో లవ్ ఎఫైర్స్, డేటింగ్స్ వెరీ కామన్. సెలెబ్రిటీలు అయినంత మాత్రాన వాళ్లు మనుషులే… వాళ్లకు కూడా మనసులు ఉంటాయి. నచ్చిన వాళ్ళ మీద ప్రేమలు, ఆకర్షణలు కలుగుతాయి. ఇవి అందరి జీవితాల్లో జరిగే విషయాలు అయినప్పటికీ సెలెబ్రిటీలను ప్రత్యేకంగా చూస్తారు. అదో హాట్ టాపిక్ గా చర్చించుకుంటారు. సెలబ్రిటీల జీవితాల్లోని ప్రతి విషయం ఆసక్తి రేపుతోంది. ప్రేమ, పెళ్లి, ఎఫైర్ వంటి విషయాలకు మరింత క్రేజ్ ఉంటుంది. టాలీవుడ్ టు బాలీవుడ్ ప్రతి ఏడాది కొన్ని కొత్త జంటలు ఏర్పడటం పాత జంటలు విడిపోవడం జరుగుతూ ఉంటుంది.

తాజాగా టాలీవుడ్ లో ఓ హీరో, హీరోయిన్ లవ్ బర్డ్స్ గా అవతరించారట. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారట. ప్రపంచాన్ని మరచి విహరిస్తున్నారట. ఎక్కడికెళ్లినా జంటగా వెళ్లడం చేస్తున్నారట. డిన్నర్ నైట్స్, వెకేషన్స్ అంటూ చక్కర్లు కొడుతున్నారట. ఈ హీరో హీరోయిన్ వ్యవహారం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందట. ఇద్దరూ తెగించి తిరుగేస్తుండగా జనాలు చెవులు కొరుక్కుంటున్నారట.
ఈ హీరోయిన్ తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినా యూత్ లో పిచ్చ పాపులారిటీ తెచ్చుకుంది. బబ్లీ లుక్స్ తో హోమ్లీ బ్యూటీగా మంచి ఇమేజ్ ఉంది. పక్కింటి అమ్మాయిలా ఉండే సదరు హీరోయిన్ కి ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. ఈ హీరోయిన్-హీరో ఎఫైర్ ఇరు కుటుంబాల పెద్దలకు కూడా తెలిసిందట. వాళ్ళు ఓకే అంటే పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నారట.

కొన్నాళ్ళు డేటింగ్ ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిన జంట అప్పుడే పెళ్లి వద్దంటున్నారట. అలాగే పెళ్లి చేసుకుంటే కెరీర్ కి అడ్డమని భావిస్తున్నారట. రానున్న రోజుల్లో వీరి రిలేషన్ పై మరింత క్లారిటీ రానుంది. అలాగే అధికారిక ప్రకటనలు కూడా రావొచ్చు అంటున్నారు. అయితే ఈ సినిమా వాళ్ళను నమ్మడానికి లేదు. ఏమాత్రం తేడా కొట్టినా లెట్స్ బ్రేకప్ అంటారు. కాబట్టి అప్పుడే ఒక నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదంటున్నారు. మరి చూడాలి యంగ్ హీరోయిన్ ఘాడమైన ప్రేమ కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది.