TSRTC MD Sajjanar: తప్ప తాగి.. బైక్ పై పడుకొని 80 స్పీడులో వెళుతూ.. పోతావ్ రరేయ్.. వైరల్ వీడియో

TSRTC MD Sajjanar: మనిషికి వేపకాయంత వెర్రి ఉంటుందట. అది వేయి రకాలుగా మారుతుందట. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వెర్రి ఉండటం సహజమే. మనిషి కోతి నుంచి వచ్చాడనటానికి ఇదే నిదర్శనం. దీంతో మనిషిలో కూడా కొన్ని జంతు లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి రాక్షసుడిలా మారి హత్యలు చేస్తాడు. కొన్ని సార్లు ప్రేమపేరుతో వేధిస్తాడు. ఇలా ఒక్కో రకంగా జంతువులో ఉండే లక్షణాలు అన్ని మనిషిలో కనిపించడం సాధారణమే. కానీ మనిషి జంతువులా మారితే చుట్టు ఉన్న […]

Written By: Srinivas, Updated On : April 18, 2023 5:57 pm
Follow us on

TSRTC MD Sajjanar

TSRTC MD Sajjanar: మనిషికి వేపకాయంత వెర్రి ఉంటుందట. అది వేయి రకాలుగా మారుతుందట. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వెర్రి ఉండటం సహజమే. మనిషి కోతి నుంచి వచ్చాడనటానికి ఇదే నిదర్శనం. దీంతో మనిషిలో కూడా కొన్ని జంతు లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి రాక్షసుడిలా మారి హత్యలు చేస్తాడు. కొన్ని సార్లు ప్రేమపేరుతో వేధిస్తాడు. ఇలా ఒక్కో రకంగా జంతువులో ఉండే లక్షణాలు అన్ని మనిషిలో కనిపించడం సాధారణమే. కానీ మనిషి జంతువులా మారితే చుట్టు ఉన్న వారికి నరకమే.

ప్రస్తుత కాలంలో అన్ని ఫ్యాషన్ లా మారుతున్నాయి. హ్యాండిల్ విడిచి ద్విచక్ర వాహనం నడపడం, బైక్ మీద ముద్దులు పెట్టుకుంటూ వెళ్లడం ఈ చేష్టలు చూస్తుంటే మనకు ఏమనిపిస్తుంది. మనం నాగరికత ప్రపంచంలోనే ఉన్నామా? లేక అరణ్యంలో జీవిస్తున్నామా? అనే అనుమానాలు రావడం సహజమే. కానీ మనిషికి వెర్రి ఒకలా ఉండనీయడం లేదు.

తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ షేర్ చేసిన ఓ వీడియో అందరిలో ఆశ్చర్యం నింపుతోంది. అర్థరాత్రి వేళ ఓ యువకుడు హ్యాండిల్ విడిచి వెల్లకిలా పడుకుని బైక్ నడుపుతున్నాడు. అది అదుపు తప్పడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అదే పెద్ద ప్రమాదం అయితే అతడి ప్రాణాలు గాల్లో కలిసేవి. ఎందుకు యువత ఇలా రెచ్చిపోతోంది. ధైర్యం వారికే ఉందా? మత్తులో ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఫలితంగా తల్లిదండ్రులకు శోకం మిగుల్చుతున్నారు.

TSRTC MD Sajjanar

ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. అయినా వారిలో మార్పు కనిపించడం లేదు. యువత అంటే ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయడం కాదు. మంచి పనులు చేసి నలుగురిలో మంచివాడిగా అనిపించుకుంటే అతడిని హీరో అంటారు కానీ ఇలాంటి పిచ్చి పనులు చేసేవారిని హీరో అనరు వెర్రివాడు అని పిలుస్తారు. ఇలా వెర్రితలలు వేయడం కొత్తేమీ కాదు. కానీ వారి ప్రాణాలు పోతే ఎవరికి నష్టం. కన్నవారికే కదా అనే కామెంట్లు వస్తున్నాయి.