https://oktelugu.com/

Allu Arjun Pushpa 2 : పుష్ప2 కోసం అల్లు అర్జున్ ఏం చేస్తున్నాడో చూడండి..

Allu Arjun Pushpa 2 : పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదేలే అంటూ బాక్సాఫీస్ వద్ద తగ్గకుండా కలెక్షన్ల వర్షం కురిపించాడు మన బన్నీ. అయితే పుష్ప1 ప్యాన్ ఇండియా లెవల్ లో హిట్ కావడంతో ఇప్పుడు పుష్ప2 కోసం కష్టపడుతున్నాడు. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ దుమ్మురేపింది. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పుష్ప1 కంటే పుష్ప2కు మరింతగా క్రేజ్ పెరిగింది. ఇది ప్యాన్ ఇండియా లెవల్ లో దుమ్మురేపుతోంది. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ లో అల్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : April 18, 2023 / 06:02 PM IST
    Follow us on

    Allu Arjun Pushpa 2 : పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదేలే అంటూ బాక్సాఫీస్ వద్ద తగ్గకుండా కలెక్షన్ల వర్షం కురిపించాడు మన బన్నీ. అయితే పుష్ప1 ప్యాన్ ఇండియా లెవల్ లో హిట్ కావడంతో ఇప్పుడు పుష్ప2 కోసం కష్టపడుతున్నాడు. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ దుమ్మురేపింది. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

    పుష్ప1 కంటే పుష్ప2కు మరింతగా క్రేజ్ పెరిగింది. ఇది ప్యాన్ ఇండియా లెవల్ లో దుమ్మురేపుతోంది. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ లో అల్లు అర్జున్ బిజిబిజీగా ఉన్నాడు.

    పుష్ప2లో బన్నీ చాలా రఫ్ లుక్ లో ఉన్నాడు. ‘రా అండ్ రగ్గడ్ ’ గెటప్ లో కనిపిస్తున్నారు. ఇందుకోసం కొన్ని నెలల పాటు ప్రత్యేక డైట్ ను ఫాలో అవుతున్నాడు.

    పుష్ప2 షూటింగ్ గ్యాప్ లోనూ బన్నీ ఫిట్ నెస్ కు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాడు. 41 ఏళ్ల వయసులోనూ ఫిట్ గా ఉంటూ స్టైలిష్ లుక్ ను మెయింటేన్ చేస్తున్నాడు.

    ఇప్పటికే టాలీవుడ్ లో ఫస్ట్ సిక్స్ ప్యాన్ ను చేసిన హీరో అల్లు అర్జున్ నే. పుష్ప2లోనూ ఈసారి మరింత బాడీ పెంచి భీకర లుక్ లో కనిపించేందుకు తెగ కష్టపడుతున్నాడు. జిమ్ లో చమటలు చిందిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

    పుష్ప2 సినిమా కోసం నిర్మాలైన మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. పుష్ప 2 బడ్జెట్ రూ. 300 కోట్లు అని అంచనా. పార్ట్ వన్ తో పోల్చుకుంటే ఇది రెండు రెట్లు అధికం. పుష్ప వరల్డ్ వైడ్ రూ. 360 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వెయ్యి కోట్ల టార్గెట్ తో పుష్ప 2 విడుదల చేస్తున్నారని సమాచారం. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్.ౌ

    https://twitter.com/OnlyAlluArjun08/status/1648210154553323521?s=20