Homeజాతీయ వార్తలుTSPSC Paper Leak Case: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు: సిట్ సీల్డ్ కవర్...

TSPSC Paper Leak Case: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు: సిట్ సీల్డ్ కవర్ లో నమ్మలేని నిజాలు

TSPSC Paper Leak Case
TSPSC Paper Leak Case

TSPSC Paper Leak Case: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుకు సంబంధించి విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ పేపర్ లీకేజీకి సంబంధించిన రిపోర్టును మంగళవారం సీల్డ్ కవర్లో హైకోర్టుకు అందజేయనుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ సీల్డ్ కవర్లో అధికారులు ఎటువంటి సమాచారాన్ని హైకోర్టుకు అందజేయనున్నారు? ఇందులో విశ్వసనీయత ఎంత? ఇందుకు సంబంధించి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో సీట్ స్టేటస్ రిపోర్టు రెడీ చేసింది. బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ సహా ఇన్విస్టిగేషన్ సందర్భంగా బయటికి వచ్చిన కీలక అంశాలతో కూడిన స్టేటస్ రిపోర్ట్ ను సిట్ రూపొందించినట్టు తెలుస్తోంది. మంగళవారం ఉదయం సిగల్ కవర్లో హైకోర్టుకు ఈ నివేదిక సమర్పించనున్నది. పేపర్ లీకేజీ ద్వారా ఐదుగురు గ్రూప్_1, ఇద్దరు అసిస్టెంట్ ఇంజనీర్, ఇద్దరు డిఏవో పరీక్షలు రాసినట్టు గుర్తించారు. 17 మంది నిందితులు ఇచ్చిన వివరాలతో అనుమానితులందరినీ విచారిస్తున్నమని, ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని తుది రిపోర్టులో వివరించినట్టు తెలుస్తోంది.

అయితే పేపర్ లీకేజీ సంఘటనపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వాలని ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ గత నెల 21న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 3.50 లక్షల మంది గ్రూప్_1 ఎగ్జామ్ రాశారని, అందులో 25 వేల మంది ఎంపికయ్యారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఆరు పరీక్షలు రద్దు చేశారని కోర్టుకు వివరించారు. సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. పిటిషన్ పై విచారణ జరిగిన హైకోర్టు ఏప్రిల్ 11న స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని సిట్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సిట్ సీల్ కవర్లో స్టేటస్ రిపోర్టు మంగళవారం అందజేయనుంది.

TSPSC Paper Leak Case
TSPSC Paper Leak Case

ఈ కేసు కు సంబంధించి ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి తో పాటు మొత్తం 17 మంది నిందితులకు సంబంధించిన పూర్తి వివరాలతో స్టేటస్ రిపోర్ట్ తయారు చేసినట్టు తెలుస్తోంది. సిట్ దర్యాప్తులో భాగంగా 450 మందిని విచారించినట్టు సమాచారం. అక్టోబర్ 16న జరిగిన గ్రూప్_1 ఎప్పుడు లీక్ చేశారో కూడా సిట్ వెల్లడించింది. ఇందులో 100కు పైగా మార్కులు వచ్చిన వారిలో 121 మందిని విచారించినట్టు రిపోర్ట్ లో వెల్లడించింది. జగిత్యాల జిల్లా మాల్యాలకు చెందిన 35 మంది వివరాలను కూడా రిపోర్టులో పేర్కొన్నట్టు సమాచారం. దర్యాప్తులో భాగంగా టిఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి, సెక్రటరీ అనిత రామచంద్రన్, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి పేపర్స్ లీకేజ్ చేసినట్టు తమ ఇన్వెస్టిగేషన్లో వెళ్లడైందని స్టేటస్ రిపోర్ట్ లో సిట్ వివరించింది. ప్రవీణ్ ద్వారా అధికంగా పనిచేసిన దామెర రమేష్, సురేష్ లకు రాజశేఖర్ రెడ్డి ద్వారా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ చైర్మన్, న్యూజిలాండ్ లోని ప్రశాంత్ రెడ్డికి గ్రూప్_1 పేపర్ చేరిందని సిట్ రిపోర్టులో పేర్కొన్నట్టు తెలిసింది.

ఏఈ క్వశ్చన్ పేపర్ రేణుక నుంచి ఆమె భర్త డాక్యా నాయక్, తమ్ముడు రాజేశ్వర్ కు చేరినట్టు రిపోర్టులో ప్రస్తావించింది. ప్రవీణ్ బ్యాంక్ లావాదేవీల ఆధారంగా డీఎవో పేపర్ లీకేజీ గుర్తించింది. ఆరు లక్షలకు పేపర్ కొన్న ఖమ్మం జిల్లాకు చెందిన సుస్మిత, ఆమె భర్త లౌకిక్ వివరాలను స్టేటస్ రిపోర్టులో వివరించినట్లు సమాచారం. నిందితుల సెల్ ఫోన్స్, లాప్టాప్స్, పెన్ డ్రైవ్లు, టీఎస్పీఎస్సీ సెక్షన్ ఆఫీసర్ కు చెందిన కాన్ఫిడెన్షియల్ సిస్టం, హార్డ్ డిస్క్లో దొరికిన డేటా గురించి రిపోర్టులో వెల్లడించినట్టు తెలుస్తోంది. మరి ఈ రిపోర్టు ఆధారంగా హైకోర్టు ఎటువంటి చర్య తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version