Rashmi Gautham: సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది యాంకర్ రష్మీ గౌతమ్. మీటింగ్స్, షూటింగ్స్ కి షార్ట్ బ్రేక్ ఇచ్చి ఇష్టమైన ప్రదేశానికి చెక్కేసింది. విదేశీ వీధుల్లో, చల్లని సాగర తీరాల్లో చక్కర్లు కొడుతుంది. నిక్కరేసుకున్న యాంకర్ రష్మీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తన టూర్ డైరీస్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత రష్మీ ట్రిప్ ప్లాన్ చేశారు.
రష్మీ యాంకర్ గా ఫుల్ బిజీ. ప్రస్తుతం ఆమె జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో సందడి చేస్తున్నారు. ఆ మధ్య జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కి కూడా యాంకరింగ్ చేశారు. అనసూయ తప్పుకోవడంతో రష్మీకి కలిసొచ్చింది. అయితే కొన్ని వారాల తర్వాత కొత్త యాంకర్ ని లైన్లోకి తెచ్చారు. కన్నడ బ్యూటీ సౌమ్యరావు జబర్దస్త్ యాంకర్ గా అనసూయ స్థానంలోకి వచ్చింది. దీంతో ఎక్స్ట్రా జబర్దస్త్ కి రష్మీ పరిమితమయ్యారు.
బుల్లితెర మీద స్టార్ గా వెలిగిపోతున్న రష్మీకి సినిమా ఆఫర్స్ తగ్గాయి. వరుస పరాజయాల నేపథ్యంలో ఆమె జోరు తగ్గింది. ఒక దశలో రష్మీ నటిగా బిజీ అయ్యారు. వచ్చిన ఆఫర్స్ అన్ని చేసుకుంటూ పోయింది. దీంతో పరాజయాలు ఎదురయ్యాయి. హీరోయిన్ గా రష్మీ చివరి చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. గత ఏడాది విడుదలైన ఈ చిత్రంలో నందు హీరోగా నటించారు. బొమ్మ బ్లాక్ బస్టర్ సైతం నిరాశపరిచింది.
అయితే రష్మీ సంపాదనకేమీ ఢోకా లేదు. యాంకరింగ్, ప్రమోషన్స్ ద్వారా లక్షల్లో సంపాదిస్తుంది. రష్మీకి హైదరాబాద్ లో లగ్జరీ హౌస్ ఉంది. ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆ మధ్య ఓ నిర్మాత రష్మీకి విల్లా గిఫ్ట్ గా ఇచ్చాడంటూ యూట్యూబ్ వీడియో తెరపైకి వచ్చింది. దీనిపై రష్మీ స్వయంగా స్పందించారు.
నేను కొనుక్కున్న కార్లు, ఇళ్ళు నా కష్టార్జితంతో సమకూర్చుకున్నవి. షూటింగ్స్ లో పగలు రాత్రి కష్టపడితే వచ్చినవి. నాకు ఏ నిర్మాత ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వలేదని వివరణ ఇచ్చారు. మరోవైపు సుధీర్-రష్మీ లవ్ ఎఫైర్ ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ గా ఉంది. సుధీర్ నీకు ఏమవుతాడంటే రష్మీ అస్పష్టమైన సమాధానాలు చెబుతుంది.