Tirupati Zoo Park: మనిషికి, మృగానికి తేడా ఏంటంటే.. మనిషికి వివేచన ఉంటుంది.. మృగానికి క్రూరత్వం ఉంటుంది. అందుకే మృగాలకు దూరంగా ఉండాలి అని చెప్పేది. అలాంటి క్రూరత్వం ఉంటుంది కాబట్టే మృగాలు అడవిలో ఉంటాయి. అడవులు తగ్గిపోతున్నాయి కాబట్టి క్రూర జంతువులు జూలో ఉంటున్నాయి.. కానీ వివేచన ఉండాల్సిన ఓ మనిషి జూ ఎన్ క్లోజర్ లోకి దూకాడు. అది కూడా సింహం ఉండే ఏరియాలోకి.. అసలే అది జూలో ఉంది.. ఆపై బంధీగా ఉంది. ఏముంది దెబ్బకు జూలు విధిల్చింది.. తర్వాత ఏం జరిగిందో ఇక చెప్పే పనేముంది చదివేయండి..
తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూపార్కులో ఎన్నో రకాల జంతువులు ఉంటాయి. సింహాల నుంచి పులుల వరకు అనేక క్రూర మృగాలను ఇక్కడి జంతు ప్రదర్శనశాలలో ఎన్నో సంవత్సరం నుంచి సంరక్షిస్తున్నారు.. ఈ జూలో జంతువులను చూసేందుకు ప్రతిరోజు వందలాదిమంది సందర్శకులు వస్తూ ఉంటారు. అలా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఒక సందర్శకుడు కూడా వచ్చాడు.. ఆ యువకుడు పేరు ప్రహ్లాద్ గుజ్జర్ వయసు 38 సంవత్సరాల దాకా ఉంటుంది. అతడిది రాజస్థాన్ రాష్ట్రంలో అల్వార్ జిల్లా తురాణ గ్రామం. జూలో జంతువులను సందర్శించేందుకు గురువారం మధ్యాహ్నం వచ్చాడు. సింహాల ఎన్ క్లోజర్ వద్దకు వచ్చి హఠాత్తుగా గేటు పైకి ఎక్కాడు. సిబ్బంది వారిస్తున్నప్పటికీ అందులోకి దూకేశాడు.
ఆ ఎన్ క్లోజర్ లో ఉన్న సింహాన్ని నాలుగు సంవత్సరాల క్రితం రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు. అప్పటికి దాని వయసు నాలుగు సంవత్సరాలు. అది తిరుపతి జంతు ప్రదర్శనశాలకు వచ్చిన తర్వాత మరింత చురుకుతనాన్ని సంతరించుకుంది. ప్రహ్లాద్ ఆ సింహం ఉండే ఎన్ క్లోజర్ లో దూకడంతో అది హఠాత్తుగా అతడి గొంతు నోట కర్చుకుని 100 మీటర్ల దూరం లాక్కెళ్ళింది. జూ సిబ్బంది కర్రలు చేతపట్టుకొని గట్టిగా అరవడంతో అది అతడిని వదిలిపెట్టి బోనులోకి వెళ్లిపోయింది. వైద్యుడు, జూ సిబ్బంది అక్కడికి వెళ్లేసరికి అప్పటికే అతడు చనిపోయి ఉన్నాడు.. అతడి మృతదేహాన్ని తిరుపతి రొయ్య ఆసుపత్రికి తరలించారు. ప్రహ్లాద్ ఎన్ క్లోజర్ లోకి ఎందుకు దూకాడో ఇప్పటికీ అంతు పట్టడం లేదు. అతడు చాలా దూరం నుంచి పరుగులు తీస్తూ ఎన్ క్లోజర్ తొలి గేటు ఎక్కాడు. ఆ తర్వాత 12 అడుగుల ఎత్తు ఉన్న రెండవ గేటు కూడా ఎక్కి దూకాడు. అలా అతడు గేటు ఎత్తినప్పుడు సెల్ఫీ దిగే ప్రయత్నం గాని.. వీడియో తీసే ప్రయత్నం గాని చేయలేదు. అప్పటికి అతని వద్ద ఎటువంటి ఫోన్ కూడా లేదు. ప్రహ్లాద్ మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడమైనా లేక ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశమైనా అతడికి ఉండి ఉండవచ్చని జూ అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ ఘటన తిరుపతిలో సంచలనం సృష్టించింది. ప్రహ్లాద్ మృతి నేపథ్యంలో అక్కడి జూ అధికారులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు.
తిరుపతి జూలో సింహతో సెల్ఫీ ట్రై చేసి తొడ కొట్టిన యువకుడు
దాడి చేసి చంపేసిన సింహం
తిరుపతి – శ్రీ వెంకటేశ్వర జూలో సందర్శనకు వచ్చిన ఓ యువకుడు సెల్ఫీ కోసం లయన్ ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు.
అక్కడ సింహాన్ని చూసి తొడగొట్టాడు. దీంతో సింహం అతడిపైకి దూసుకొచ్చింది. తప్పించుకునేందుకు అతడు… pic.twitter.com/0Ak2vfPdMW
— Telugu Scribe (@TeluguScribe) February 15, 2024