Pending Challans: వాహనాల పెండించ్ చలాన్లపై ప్రభుత్వం ఇచ్చిన రాయితీ చెల్లింపు గడువు గురువారం(ఫిబ్రవరి 15) అర్ధరాత్రితో ముగిసింది. ఇప్పటికే రెండుసార్లు గడువు పెంచిన ప్రభుత్వం మళ్లీ పెంచే ఆలోచన చేయలేదు. ఇక రాయితీ చలాన్ల వసూలు ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. గురువారం సాయంత్రం వరకు 1.60 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయని అధికారులు వెల్లడించారు.
రెండుసార్లు గడువు పెంపు..
గత డిసెంబర్‌లో ప్రభుత్వం వాహనాల పెండింగ్ చలాన్లపై రాయితీ ప్రకటించింది. జనవరి 10వ తేదీ వరకు మొదట గడువు పెట్టింది. తర్వాత జనవరి చివరి వరకు పెంచింది. అయినా పెండిగ్ చలాన్లు క్లియర్ కాకపోవడంతో మరోమారు గడవు ఫిబ్రవరి 15 వరకు పెంచింది. గడువు పూర్తయ్యే నాటికి రూ.147 కోట్లు ఖజానాలో జమయ్యాయి.
రాయితీ ఇలా..
ట్రాఫిక్ చలాన్లపై కేటగిరీల వారీగా తగ్గింపులు ఇచ్చింది.
– ద్విచక్రవాహనాలు, ఆటోలకు 20 శాతం చలాన్ చెల్లిస్తే 80 శాతం మాఫీ అయింది.
– పుష్ కార్టులు, చిన్న వ్యాపారులు(39బి కేసులు), ట్రాఫిక్ చలాన్ 10 శాతం చెల్లిస్తే 90 శాతం మాఫీ చేసింది.
– తేలికపాటి మోటారు వాహనాలు, కార్లు, జీపులు, భారీ వాహనాలకు 40 శాతం చెల్లిస్తే మిగిలిన 60 శాతం మాఫీ అవుతుంది.
– రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) డ్రైవర్లకు, ట్రాఫిక్ చలాన్‌లో 10 శౠతం చెల్లిస్తే మిగిలిన 90 శాతం మాఫీ అవుతుంది.