Viral Video: రోజు రోజుకూ టెక్నాలజీ పెరుగుతున్నా.. మనుషులు మాత్రం తమ ఆలోచన విధానాల్లో మార్పులు చేసుకోవడం లేదు. ప్యూచర్ లో ఎన్ని సమస్యలు వస్తాయో తెలిసినా కూడా వాటి గురించి పట్టించుకోవడం లేదు. పర్యావరణం గురించి కలత చెంది కొందరు మాత్రమే మంచి పనులు చేస్తుంటే.. మరికొందరు హా.. నాకేంటిలే అంటూ లైట్ తీసుకుంటున్నారు. రోజు రోజుకు పర్యావరణ సమస్యలు మరింత పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో ప్లాస్టిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
ప్లాస్లిక్ వ్యర్థాలతో భూమి మొత్తం నిండిపోయినా కూడా మనుషులు మారేలా లేరు అంటూ పర్యావరణం గురించి కలత చెందేవారు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ప్లాస్టిక్ భూమిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందనే విషయం తెలిసిందే. అయితే కొన్ని సార్లు మనుషుల కంటే జంతువులే నయం అంటారు జంతు ప్రేమికులు. అయితే పులి అంటే ముందుగా అందరికీ గుర్తు వచ్చేది.. కర్కశం. క్రూరత్వం. దయ జాలి లేకుండా వేటాడం వంటివి గుర్తు వస్తుంటాయి. కానీ ఇక్కడ ఒక పులి మాత్రం దానికి విరుద్దంగా చేసింది.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే పులి గురించి తెలిస్తే.. పులి మనుషులకు మంచి మెసేజ్ నేర్పించింది అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. ఎందుకంటారా? భూమి మీద కళ్ల ముందు ఎంత ప్లాస్టిక్ కనిపిస్తున్నా.. ఎవరు పట్టించుకోకుండా మరీ వెళ్తుంటారు. కానీ ఈ పులి మాత్రం అలా కాదు.. నీరు తాగడానికి వెళ్తున్న పులికి ఆ నీటిలో వాటర్ బాటిల్ కనిపించడంతో దాన్ని తీసుకొని వెళ్లింది. వాటర్ లో నుంచి ఆ బాటిల్ ను తీసుకొని నోట కర్చుకొని బయట పడేయడానికి వెళ్లింది.
ప్లాస్టిక్ భూమి మీద ఉంటేనే డేంజర్. అలాంటిది నీటిలో ఉంటే మరింత డేంజర్ అనుకుంది కావచ్చు. మేమే తాగే నీరు కలుషితం అవకూడదు అనుకొని పులి ఎంత మంచి పని చేసిందో కదా.. కానీ మనుషులు మాత్రం తమకు డేంజర్ అని తెలిసి కూడా ఇలాంటి పనులు చేయడానికి ఆలోచిస్తారు. అందుకే కొన్ని సార్లు జంతువుల నుంచి కూడా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి.
Why should the wild clean the garbage of the (un)civilised
Please stop carrying plastics & styrofoams into the wilderness(Credit it the clip) pic.twitter.com/fSTekEYe5f
— Susanta Nanda (@susantananda3) February 14, 2024