Homeఆంధ్రప్రదేశ్‌Mangalagiri: మంగళగిరిలో మారుతున్న లెక్కలు.. జగన్ స్పెషల్ ఫోకస్

Mangalagiri: మంగళగిరిలో మారుతున్న లెక్కలు.. జగన్ స్పెషల్ ఫోకస్

Mangalagiri: సీఎం జగన్ దూకుడు మీద ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్, లోకేష్ లు అసెంబ్లీలో అడుగుపెట్టకూడదని భావిస్తున్నారు. ఇందుకోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కుప్పంలో ఇప్పటికే ఆపరేషన్ ప్రారంభించారు. అక్కడ భరత్ ను ఇన్చార్జిగా నియమించి ఎమ్మెల్సీగా చేశారు. కుప్పం మున్సిపాలిటీ తో పాటు మిగతా 5 మండలాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేశారు. కుప్పం బాధ్యతను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఆయన ఖాళీ ఉంటే చాలు కుప్పంలో వాలిపోతున్నారు. ఇప్పుడు లోకేష్ పై పడ్డారు. మంగళగిరిలో ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ గెలవకూడదని భావిస్తున్నారు. ఆ బాధ్యతను విజయ సాయి రెడ్డికి అప్పగించారు.

తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉండే గంజి చిరంజీవిని వైసీపీలోకి రప్పించారు. మంగళగిరి అభ్యర్థిగా ఆయనను ప్రకటించారు. చేనేత సామాజిక వర్గం అధికంగా ఉండే మంగళగిరిలో.. అదే సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిని ఎంపిక చేయడం వ్యూహాత్మకమని తెలుస్తోంది. అయితే అక్కడ చిరంజీవికి వైసీపీ శ్రేణుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం దక్కడం లేదు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల చిరంజీవిని వ్యతిరేకిస్తున్నారు. దీంతో అక్కడ వైసిపి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ తరుణంలోనే గంజి చిరంజీవిని మార్చుతారని ప్రచారం జరిగింది. కానీజగన్ మాత్రం ఆ సాహసం చేయలేదు.

ప్రస్తుతం మంగళగిరి సమన్వయ బాధ్యతలను విజయసాయి రెడ్డికి జగన్ అప్పగించారు. దీంతో విజయసాయి ఆ నియోజకవర్గంలో పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. చిరంజీవి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న హనుమంతరావు, కాండ్రు కమల లను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అటు చిరంజీవి సైతం తనకు ఎదురవుతున్న సహాయ నిరాకరణను విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్ కు విజయసాయిరెడ్డి నివేదిక ఇచ్చారు. దీంతో ఆ ఇద్దరు నేతలను జగన్ పిలిపించుకుని మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి ప్రతిష్టాత్మకమని.. ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ ను ఓడించాల్సిందేనని ఇద్దరు నేతలకు దిశానిర్దేశం చేశారు. దీంతో ఆ ఇద్దరు నేతలు మెత్తబడినట్లు సమాచారం. మరోవైపు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న చేనేత వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చే బాధ్యతను విజయసాయిరెడ్డి తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే మంగళగిరిలో లోకేష్ ను ఎలాగైనా ఓడించాలన్న ధ్యేయంతో వైసిపి పనిచేస్తోంది. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version