Bigg Boss 6 Telugu Inaya – Sri Satya: ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా బిగ్ బాస్ లో ఎవ్వరూ ఊహించని ఎలిమినేషన్స్ జరగబోతుంది..టైటిల్ విన్నర్ గా నిలుస్తుంది అనుకుంటున్న ఇనాయ ఈ వారం ఎలిమినేట్ అయిపోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..ఇనాయ కి ఈ వారం ఓటింగ్ బాగా తగ్గిపోయిందని..టాస్కులలో ఈమధ్య ఆమె ఎక్కువగా కనిపించకపోవడం వల్లే అలా జరిగిందని, ఇలా రకరకాల వార్తలు ప్రచారం లో ఉన్నాయి..కానీ ఇనాయ ఎలిమినేషన్ వార్త ని జీర్ణించుకోలేకపోతున్నారు ఫ్యాన్స్.

మొదటి నుండి నేటి వరకు ఇనాయ హౌస్ సోలో వారియర్ గా పోరాడుతూ వచ్చిందని..టాస్కులు వచ్చినప్పుడు ప్రత్యర్థులతో ఆడపులి లాగా తలపడుతుందని..అలాంటి కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేస్తే మాత్రం ఇక జీవితం లో బిగ్ బాస్ షో చూడబోమని నెటిజెన్స్ బిగ్ బాస్ టీం పై విరుచుకుపడుతున్నారు..ఇనాయ తో పాటుగా శ్రీ సత్య కూడా ఎలిమినేట్ అవ్వబోతుందని తెలుస్తుంది..ఇక టైటిల్ గెలుచుకోబోయ్యే కంటెస్టెంట్ విషయం లో కూడా చివరి వరుకు ఈసారి సస్పెన్స్ తప్పదని అర్థం అవుతుంది.
సోషల్ మీడియా లో జరుగుతున్న అనధికారిక ఓటింగ్ ప్రకారం ఇనాయ అత్యధిక ఓట్లతో రెండవ స్థానం లో ఉంది..వచ్చే వారం రేవంత్ ని దాటి నెంబర్ 1 అవుతుందని..టైటిల్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు..కానీ కనీసం టాప్ 5 లోకి కూడా ఆమె అడుగుపెట్టలేకపోవడం నిజంగా మోసమే..శ్రీ సత్య ఎలాగో డేంజర్ జోన్ లోనే ఉంది..ఆమె ఎలిమినేట్ అయినా ఎవరికీ ఏమి అనిపించదు..కానీ ఇనాయ టాప్ 5 లో చోటు దక్కించుకోలేకపోవడం నిజంగా బాధాకరం.

ఇప్పటికే ఇలాంటి ఎలిమినేషన్స్ ఈ సీజన్ లో చాలానే జరిగాయి..ప్రేక్షకులు ఇచ్చిన తీర్పుకి పూర్తిగా వ్యతిరేకంగా ఉండడం వల్లే ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది..వచ్చే ఏడాది బిగ్ బాస్ సీజన్ పై ఎవ్వరూ కూడా ఆసక్తి చూపించరు..చేతులారా బిగ్ బాస్ టీం బంగారం లాంటి TRP రేటింగ్స్ వచ్చే షో ని నాశనం చేసుకున్నారు అంటూ విశ్లేషకులు చెప్తున్నారు.