Homeక్రీడలుWomen U-19 USA Team: అంతా భారత అమ్మాయిలే.. ఇండియా బీ టీంగా ...

Women U-19 USA Team: అంతా భారత అమ్మాయిలే.. ఇండియా బీ టీంగా ‘అమెరికా అండర్-19 టీ20 జట్టు’అంతా భారత అమ్మాయిలే.. ఇండియా బీ టీంగా ‘అమెరికా అండర్-19 టీ20 జట్టు’

Women U-19 USA Team: ఏదేశమేగినా.. ఎందుకాలిడినా.. సర్వం భారతీయమే కనిపిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాను కూడా మనోళ్లు ఏలుతున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలహారిస్ ది కూడా తమిళనాడు మూలాలే. ఇక అమెరికాలోని టాప్ కంపెనీలను నడిపించేది మన భారతీయులే. అవకాశాల కోసం భారతీయులు అమెరికా వెళ్లి ఇప్పుడు అక్కడ అగ్రపథాన దూసుకెళుతున్నారు. వ్యాపారాలు, ఉద్యోగాలు, రాజకీయాలు ఇలా కాదు మనకు ఏది అనర్హం అన్నట్టుగా ముందుకెళుతున్నారు. తాజాగా అమెరికా అండర్ 19 క్రికెట్ టీంను ప్రకటిస్తే.. అందులో మొత్తం మన భారతీయులే కనిపించడం అందరినీ షాక్ కు గురిచేసింది.

Women U-19 USA Team
Women U-19 USA Team

మన భారతీయ అమ్మాయిలతో అమెరికా అండర్ 19 జట్టు నిండిపోయింది. అమెరికాలో క్రికెట్ కు ఆదరణ చాలా తక్కువ. స్వతహాగా అమెరికన్లు ఈ ఆటపై ఆసక్తి చూపించరు. కానీ ఇండియాలో క్రికెట్ అంటే ఒక మతం. అందుకే భారతీయులకు క్రికెట్ పై ఆ యావ. అమెరికా వెళ్లినా మనోళ్లు క్రికెట్ ను వదల్లేదు. అందుకే అక్కడ అమెరికా జాతీయ జట్టులో అంతా మన భారతీయులదే ఆధిపత్యం కనిపిస్తోంది. అమెరికా జట్లు అన్నింటిలోనూ భారతీయులే కనిపిస్తున్నారు.

ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ 2023 ప్రారంభ ఎడిషన్ కోసం అమెరికా క్రికెట్ అసోసియేషన్ బుధవారం 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. అండర్-19 టీ20 ప్రపంచ కప్ వచ్చే నెల నుండి దక్షిణాఫ్రికాలో జరుగుతుంది. ఇక్కడ అండర్-19 మహిళల టీ20 ఛాంపియన్‌లుగా మారడానికి మొత్తం 16 జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. 11 ఐసీసీ పూర్తి-సభ్య దేశాలు టోర్నమెంట్‌కు ఇప్పటికే అర్హతను పొందగా, మిగిలిన ఐదు స్థానాలను ఐసీసీ అనుబంధ ఐదు దేశాల నుండి ఒక్కొక్క జట్టు భర్తీ చేసింది. క్వాలిఫైయింగ్ రౌండ్ లో అమెరికా కూడా గెలిచి ఈ టోర్నీకి అర్హత పొందింది.

ఐసీసీ అండర్-19 టీ20 ప్రపంచ కప్ 2023 జనవరి 14న ప్రారంభమవుతుంది “చరిత్రాత్మకమైన మొదటి ప్రపంచ కప్ ప్రదర్శన కోసం అమెరికా మహిళల అండర్ 19 క్రికెట్ జట్టు, అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహించే 15-ఆటగాళ్ళ జట్టును ప్రకటించింది. అమెరికా సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో జట్టు ప్రకటన చేయడంతో, నెటిజన్లు అందులోని క్రీడాకారిణులను చూసి షాక్ తిన్నారు. ఈ స్క్వాడ్ భారతదేశం బీ టీం జట్టులా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎందుకంటే అమెరికా జట్టులో ఉన్న మెజార్టీ క్రీడాకారిణులు అంతా భారత సంతతి వారే కావడం విశేషం. మన తెలుగు అమ్మాయిలు కూడా ఇందులో ఎక్కువగానే ఉన్నారు. జట్టులో ఎంపికైన 15 మంది ఆటగాళ్లతోపాటు, అమెరికా క్రికెట్ కూడా ప్రతిష్టాత్మక టోర్నమెంట్ కోసం ఐదు నాన్-ట్రావెలింగ్ రిజర్వ్‌లను ప్రకటించింది.

Women U-19 USA Team
Women U-19 USA Team

ఈ టోర్నమెంట్ జనవరి 14 నుండి జనవరి 29, 2022 వరకు జరుగుతుంది.. సెమీఫైనల్స్ జనవరి 27న పోచెఫ్‌స్ట్రూమ్‌లోని జేబీ మార్క్స్ ఓవల్‌లో జరగనున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ జనవరి 29న అదే వేదికపై హై-ఆక్టేన్ ఫైనల్‌తో ముగుస్తుంది.

టోర్నమెంట్ కోసం అమెరికా ప్రకటించిన ప్లేయర్‌లు, కోచింగ్ , సపోర్ట్ స్టాఫ్ లిస్ట్ చూస్తే ఇందులో మెజార్టీ మన భారత అమ్మాయిలే కావడం విశేషం.

ఐసీసీ అండర్-19 T20 ప్రపంచ కప్ 2023 కోసం అమెరికా మహిళల 15 మంది సభ్యుల జట్టు ఇదే

గీతిక కొడాలి (కెప్టెన్)
అనికా కోలన్ (WK) (వైస్ కెప్టెన్)
అదితి చూడసమా
భూమిక భద్రిరాజు
దిశా ధింగ్రా
ఇసాని వాఘేలా
జీవన అరస్
లాస్య ముళ్లపూడి
పూజా గణేష్ (WK)
పూజా షా
రీతూ సింగ్
సాయి తన్మయి ఎయ్యుణ్ణి
స్నిగ్ధా పాల్
సుహాని తడాని
తరణం చోప్రా

-రిజర్వ్ ప్లేయర్స్:

చేతన ప్రసాద్
కస్తూరి వేదాంతం
లిసా రామ్‌జిత్
మిటాలి పట్వర్ధన్
త్యా గొన్సాల్వేస్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version