
Anant Ambani: మనదేశంలో ధనవంతుల గురించి నిత్యం ఏదో ఒక చర్చ సాగుతూనే ఉంటుంది. అపరకుభేరుడిగా పేరు తెచ్చుకున్న ముఖేశ్ అంబానీ గురించి మాట్లాడుకోని వారుండరు. ఇటీవల ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థం రాధిక మర్చంట్ అనే అమ్మాయితో జరిగింది. ఈ వేడుకను గుజరాతీ సాంప్రదాయంలో ఘనంగా నిర్వహించారు. త్వరలో వీరి పెళ్లి వేడుక సాగనుంది. ఈ సందర్భంగా అనంత్ అంబానీని చూసి అంతా షాక్ అయ్యారు. ఆయన అధికంగా బరువు పెరిగి కనిపించారు. 2013ల మధ్య అధిక బరువుతో ఉన్న ఆయన ఆ తరువాత సన్నబడ్డారు. కానీ మళ్లీ పరిమితికి మించి లావయ్యారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీపై నెటిజన్లు ట్రోల్స్ చేశారు. దీంతో అనంత్ అంబానీ తల్లి నీతూ అంబానీ తన కూమారుడు మళ్లీ బరువు పెరగడానికి కారణాలు చెప్పింది.
2016లో అనంత్ అంబానీని చూసి నెటిజన్లు షాకయ్యారు. ఎందుకంటే ఈ సమయంలో ఆయన చాలా సన్నగా ఉన్నారు. అంతకుముందు ఆయన 200 కిలోల బరువు ఉండేవారు. పలు వ్యాయామాలు, ప్రత్యేక ఆహారం తీసుకోవడం వల్ల 100 కిలోలు తగ్గారు. దీంతో బరువు తగ్గాలనుకునేవారికి రోల్ మోడల్ గా నిలిచారు. కానీ ఒక్కసారిగా 2022లో మీడియా కంట పడిన అనంత్ లావైనట్లు కనిపించారు. మరోసారి ఆయన లావెలా అయ్యారు? అన్నప్రశ్న అందరిలో మెదిలింది. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేశారు.
వీటిపై నీతూ అంబానీ స్పందించారు. నా కుమారుడిపై ట్రోల్స్ చేసేవారికి నేను చెబుతన్నదేంటంటే దయచేసిన అందరినీ చిన్న చూపు చూడొద్దు. ఉబకాయంతో పోరాడుతున్న వాళ్లు మనచుట్టూ చాలా మందే ఉన్నారు. అయితే మా కుమారుడికి అస్తమా ఉండడం వల్ల స్టెరాయిడ్స్ వాడాల్సి వచ్చింది. దీంతో రెండోసారి లావయ్యారు అని నీతూ అంబానీ చెప్పారు. ఆమె ఇచ్చిన వివరణ పై కొందరు అవమానించేవారికి మంచిగా బుద్ధి చెప్పారు అని కొనియాడుతున్నారు.

ఇక త్వరలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహం జరగనుంది. విరేన్ మర్చంట్ -శైల దంపతుల కూతురు రాధిక మర్చంట్. ఈమె నాట్యకారిణి. ఆ మధ్య ఓ కార్యక్రమంలో సాంప్రదాయ నృత్యంలో తన ప్రతిభను చూపించారు. ఈమె డ్యాన్స్ ను చూసి నీతా అంబానీ ఇంప్రెస్ అయ్యారు. కాగా అనంత్ అంబానీ, రాధికల నిశ్చితార్థం పిక్స్ నెట్టింటా వైరల్ గామారాయి. వీరి వివాహం కోసం ఎదురుచూస్తున్నామని చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.