Bigg Boss 6 Telugu Baladitya’s elimination : బాల ఆదిత్యలో నాగార్జునకు నచ్చనిది అదే… అందుకే బయటకు పంపేశారు!

Bigg Boss 6 Telugu Baladitya’s elimination  : మరో షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. కంటెస్టెంట్ బాల ఆదిత్య శనివారం ఎలిమినేట్ అయ్యాడు. హోస్ట్ నాగార్జున బాల ఆదిత్య నేరుగా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. నిజంగా ఇది ఊహించని పరిణామమే. బాల ఆదిత్య టాప్ సెలబ్రిటీ హోదాలో హౌస్ కి వెళ్లారు. చైల్డ్ ఆర్టిస్ట్  గా పలు అవార్డ్స్ అందుకున్న బాల ఆదిత్య హీరోగా కొన్ని చిత్రాలు చేశారు. ప్రస్తుతం ఆయన వెబ్ మూవీస్, సిరీస్లలో నటిస్తున్నారు. […]

Written By: NARESH, Updated On : November 13, 2022 11:42 am
Follow us on

Bigg Boss 6 Telugu Baladitya’s elimination  : మరో షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. కంటెస్టెంట్ బాల ఆదిత్య శనివారం ఎలిమినేట్ అయ్యాడు. హోస్ట్ నాగార్జున బాల ఆదిత్య నేరుగా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. నిజంగా ఇది ఊహించని పరిణామమే. బాల ఆదిత్య టాప్ సెలబ్రిటీ హోదాలో హౌస్ కి వెళ్లారు. చైల్డ్ ఆర్టిస్ట్  గా పలు అవార్డ్స్ అందుకున్న బాల ఆదిత్య హీరోగా కొన్ని చిత్రాలు చేశారు. ప్రస్తుతం ఆయన వెబ్ మూవీస్, సిరీస్లలో నటిస్తున్నారు. ఆయనకంటూ ఒక ఇమేజ్, ఫాలోయింగ్ ఉంది. అలాంటి బాల ఆదిత్య ఎలా ఎలిమినేట్ అయ్యాడు?. అలా అని అతడేమన్న వరస్ట్ గేమరా? అనవసర గొడవలు, అర్థం లేని స్ట్రాటజీలతో ఇతర కంటెస్టెంట్స్ ని ఇబ్బందిపెడతాడా? అంటే అదీ లేదు.
 
మిస్టర్ కూల్ అండ్ బిగ్ బాస్ రేలంగి బాబాయ్ గా పేరు తెచ్చుకున్న బాల ఆదిత్య ఎలిమినేట్ కావడానికి కారణం ఒకటే… అతి మంచితనం. బిగ్ బాస్ నిర్వాహకులకు నచ్చని గుణం ఇదే. హోస్ట్ నాగార్జునకు కూడా బాల ఆదిత్యలోని మంచితనం నచ్చలేదు. మొదటి నుండి నాగార్జున బాల ఆదిత్యను మెచ్చుకున్న సందర్భాలు లేవు. పైగా చాలాసార్లు తీవ్ర విమర్శలు చేశారు. నిన్న ఎలిమినేట్ అవుతాడని తెలిసి ఎపిసోడ్ బిగినింగ్ నుండి బాల ఆదిత్య గురించి పాజిటివ్ గా మాట్లాడాడు. ప్రశంసించారు. కానీ గతంలో… నువ్వు ఆట ఆడకపోగా ఇతరులను చెడగొడుతున్నావ్ అన్నాడు. 
 
బిగ్ బాస్ షోకి కావలసింది కాంట్రవర్సీ. హౌస్లో ఎప్పుడో ఏదో ఒక గలాటా చేస్తూ ఉండాలి. పక్కవాళ్ళ గురించి మాట్లాడుతూ ఒక అనారోగ్య పూరిత వాతావరణం సృష్టించాలి. చిన్న విషయాలను పెద్దది చేయడం, అరిచి గొడవ చేసి కంటెంట్ ఇవ్వడం పనిగా పెట్టుకోవాలి. ఈ లక్షణాలేవి బాల ఆదిత్యలో లేవు. ఒక టీచర్ గా బాల ఆదిత్య ఆరోపణలకు ప్రతి ఆరోపణలకు సావధానంగా వివరణ ఇచ్చేవాడు. బాల ఆదిత్య కోప్పడ్డ సందర్భాలు అరుదు. 
 
స్పైసీ కంటెంట్ ఇవ్వలేని బాల ఆదిత్య హౌస్ కి భారం అయ్యాడు. 10వ వారం ఆయన్ని సాదరంగా సాగనంపారు. అయితే ఎలిమినేషన్ లో కూడా బాల ఆదిత్య హుందాతనం చూపించాడు. ఎమోషన్స్ బయటకు కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. ఏడుపులు పెడబొబ్బలు వంటి రొటీన్ ఎలిమినేషన్ సీన్ చేయలేదు. నవ్వుతూ అందరికీ సెండ్ ఆఫ్ చెప్పాడు. బిగ్ బాస్ హౌస్లో బాల ఆదిత్య తన క్యారెక్టర్ ఆవిష్కరించిన తీరు అద్భుతం. సిగరెట్ వంటి బ్యాడ్ హ్యాబిట్ పక్కన పెడితే బాల ఆదిత్యపై ప్రేక్షకులకు గౌరవం పెరిగింది.