Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే లైక్ చేయని వారుండరు. అన్నయ్య సినిమా ఎప్పుడొస్తుందా.. అని అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తూ ఉంటారు. ఫ్యాన్స్ కు అనుగుణంగానే మెగాస్టార్ వరుసబెట్టి సినిమాలు తీస్తూంటారు. ఓ వైపు యాక్షన్ తో పాటు మరోవైపు మాస్ సినిమాలు తీస్తూ ఆకట్టుకునే చిరంజీవి అంటే సినీ ఇండస్ట్రీలో గౌరవించని వారుండరు. ఒక్కోసారి ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే కొందరు చిన్న హీరోలు తమ సినిమాలను వాయిదా వేసుకున్న సంఘటనలు ఉన్నాయి. కానీ 2000 సంవత్సర సమయంలో సినిమాల మధ్య పోటీ తీవ్రంగా ఉండేది. చిరంజీవితో సమానంగా వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జునలు తమ సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేశారు. ఆ సమయంలో కంటెంట్ ఉన్న సినిమాలకు కాస్త క్రేజ్ ఎక్కువగా ఉన్నందున ఏదో ఒక సినిమా హిట్ కొడితే ఆ ప్రభావం మిగతా సినిమాలపై పడేది. ఇదే సంవత్సరంలో చిరంజీవి నటించిన ఓ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకు పోటీగా మరో మూవీ రిలీజ్ కావడంతో మెగాస్టార్ ఇండస్ట్రీ హిట్టు కొట్టడానికి అడ్డం పడినట్లయింది.
అప్పటి వరకు వరుస ప్లాపులతో క్రేజ్ తగ్గుతున్న చిరంజీవికి హిట్లర్ సినిమా ఆయన కెరీర్ ను మరోసారి మలుపు తిప్పింది. ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా తరువాత చిరంజీవి వెనుదిరిగి చూడలేదు. తనకు మరోసారి లైఫ్ ఇచ్చిన ముత్యాల సుబ్బయ్యతో మరికొన్ని సినిమాలు తీయాలనుకున్నారు చిరంజీవి. దీంతో ఆయన ఏ కథ తీసుకొచ్చినా ఓకే చెప్పారు. అయితే హిట్లర్ తరువాత బావగారు బాగున్నారా, ఇద్దరు మిత్రులు, స్నేహం కోసం లాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు తీశారు. కానీ ఓ మాస్ సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు.
వెంటనే ఆ విషయాన్ని అల్లు అరవింద్ తో చెప్పారు. చిరంజీవి చెప్పిన కాన్సెప్ట్ కు డైరెక్టర్ ఎవరైతే బావుండూ.. అని ఆలోచిస్తున్న తరుణంలో చిరంజీవి వెంటనే ముత్యాల సుబ్బయ్య డైరెక్టర్ పేరు చెప్పారు. అందుకు అరవింద్ ఓకే చెప్పారు. ఏమాత్రం లేట్ చేయకుండా ముత్యాల సుబ్బయ్య కథను రెడీ చేసి సినిమాను తీశారు. ముందుగా పాటలు రిలీజ్ చేశారు. ఈ పాటలు ఫుల్ సక్సెస్ కావడంతో సినిమాపై హోప్ బాగా పెరిగింది. మరోవైపు ఇందులో సౌందర్య హీరోయిన్ కావడం మరింత నమ్మకాన్ని పెంచింది. అలా చిరంజీవి, ముత్యాల సుబ్బయ్య కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘అన్నయ్య’. ఈ సినిమా 2000 సంవత్సరంలో జనవరి 7న రిలీజ్ అయింది.
ఈ సమయంలో సినిమాల మధ్య తీవ్ర పోటీ ఉండేది. ఇదే సమయంలో బాలకృష్ణ నటించిన వంశోద్ధారకుడు, మోహన్ బాబు నటించిన పోస్టు మాన్ రిలీజ్ అయ్యాయి. ఇక వెంకటేశ్ నటించిన కలిసుందాం రా కూడా థియేటర్లోకి వచ్చింది. చిరంజీవి సినిమా పోటీకి వంశోద్ధారకుడు, పోస్టుమాన్ రాలేకపోయాయి. కానీ వెంకటేశ్ నటించిన ఫ్యామిలీ ఓరియెంటెడ్ ‘కలిసుందాం..రా..’ మూవీని మాత్రం ప్రేక్షకులు ఆదరించారు. అయితే మెగాస్టార్ మూవీ ‘అన్నయ్య’ మాస్ ప్రేక్షకులను మెప్పించగలిగింది. కానీ ఆ సమయంలో ఇండస్ట్రీ హిట్ గా ‘కలిసుందాం..రా..’ నిలిచింది. ఆ సినిమా లేకపోతే ‘అన్నయ్య’నే ఇండస్ట్రీ హిట్ గా నిలిచేవారు.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: This is the movie that prevented chiranjeevi from becoming a hit
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com