https://oktelugu.com/

Tamil Nadu: పెళ్లయిన తరువాత మరో అమ్మయితో ప్రేమాయణం.. భార్య ఏం చేసిందో తెలుసా?

తమిళనాడు జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోయంబత్తూరుకు చెందిన సుజయ్, రేష్మలు భార్య భర్తలు. వీరు పొల్లాచిలోని ఓ అపార్టమెంట్ లో నివాసం ఉంటున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 5, 2023 / 03:01 PM IST
    Follow us on

    Tamil Nadu: వివాహేతర సంబంధం ఎన్నిటికైనా చేటే..అని ఎన్నో సంఘటనలు, కథలు వస్తున్నా చాలా మంది వినడం లేదు. పెళ్లైన భాగస్వామి ఉన్నా పరాయి వ్యక్తి మోజులో పడి తాత్కాలిక సుఖం పొందుతున్నారు. ఇక కొందరు అందమైన భార్య ఉన్నా.. మరో అమ్మాయితో సంబంధాలు పెట్టుకోవడం ఫ్యాషన్ గా మారింది. ఇలాంటి వాళ్లు పర్సనల్ గా ఎంతో సంతోషాన్ని పొందుతున్నా ఇతరుల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి భార్య ఉన్నా మరో అమ్మాయితో సంబంధాన్ని కొనసాగించాడు. అయితే ఆ తరువాత ఓకరి ప్రాణాలను పోవడానికి కారణమయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?

    తమిళనాడు జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోయంబత్తూరుకు చెందిన సుజయ్, రేష్మలు భార్య భర్తలు. వీరు పొల్లాచిలోని ఓ అపార్టమెంట్ లో నివాసం ఉంటున్నారు. సుజయ్ చదువుకన్న రోజుల్లో సుబ్బలక్ష్మి అనే గర్ల్ ఫ్రెండ్ ఉండేది. అయితే పెళ్లయిన తరువాత కూడా ఆమెతో సంబంధాన్ని కొనసాగించాడు. సుజయ్ కు పెళ్లికాలేదనుకొని ఆయనతో పీకల్లోకు ప్రేమలో పడింది. అయితే ఈ విషయాన్ని సుజయ్ తన భార్య, గర్ల్ ఫ్రెండ్ వద్ద తెలియకుండా జాగ్రత్తపడేవాడు.

    అక్రమ సంబంధాలు పుట్టలో పాములాంటివి. ఎప్పటికైనా బయట పడుతాయి. కొన్ని రోజుల తరువాత సుబ్బలక్ష్మికి తన దగ్గర సుజయ్ వివాహ విషయాన్ని దాచాడని తెలిసింది. దీనిపై సుజయ్ తో పాటు ఆమె భార్య రేష్మను కూడా నిలదీసింది. ఇలా కొన్ని రోజుల పాటు వీరి మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని రోజుల తరువాత మాట్లాడేది ఉందని సుబ్బలక్ష్మిని పిలిచింది రేష్మ. ఆ తరువాత వీరిద్దరి మధ్య మాటలు తీవ్రస్థాయిలో వాగ్వాదానికి చేరాయి. చివరికి సుబ్బలక్ష్మిపై రేష్మ కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

    సుబ్బలక్ష్మి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా రేష్మ తన భర్తతో కలిసి పారిపోయింది. అపార్ట్ మెంట్ లో అరుపులు వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ తరువాత పోలీసులు దర్యాప్తు చేసి ఆ తరువాత దంపతులను అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధానంగా సుజయ్ చేసిన మిస్టేక్ వల్ల ఓ అమ్మాయి బలైందని చర్చించుకుంటున్నారు. ఒక వ్యక్తిని ప్రేమించే సమయంలో అతని గురించి బాగా తెలుసుకోవాలని పోలీసులు పదే పదే సూచిస్తున్నా కొందరు పట్టించుకోవడం లేదని అనుకుంటున్నారు.