Bollywood : తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో వరుస సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని టాప్ రేంజ్ లోకి తీసుకెళ్లారు.

కాబట్టి ఒక్కొక్కరు ఇండస్ట్రీ లో వాళ్ళ ఆధిపత్య పోరును చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటిదాకా బాలీవుడ్ లో ఖాన్ త్రయం తమ హవాని కొనసాగించింది. కానీ ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా స్టామినా ఏంటో అందరికీ తెలిసి వచ్చింది. దాంతో ఇప్పుడు ఖాన్ త్రయం ప్లేస్ ని అక్యుపై చేసే హీరోలు ఎవరు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక అందులో భాగంగానే సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోలు మాత్రమే వాళ్ళ ప్లేస్ ని ఆక్యుపై చేయగలుగుతారు అంటూ మరికొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఇక అందులో ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచే ముగ్గురు, నలుగురు ఇండస్ట్రీని ఏలబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇప్పటికే ప్రభాస్ వరుస సినిమాలతో బాలీవుడ్ లో కలెక్షన్ల ను కొల్లగొడుతుంటే ఇక మిగతా హీరోలు కూడా వాళ్ళ వరుస సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేయాలని చూస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో ఖాన్ త్రయం ప్లేస్ ని ఆక్యుపై చేసే ముగ్గురు స్టార్ హీరోలు ఎవరు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయంలో కొంతమంది తెలుగు సినిమా మేధావులు సైతం ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్ లు ఖాన్ త్రయం ప్లేస్ ని ఆక్యుపై చేసే అవకాశాలు ఉన్నాయంటూ భారీ ఎత్తున ప్రచారం అయితే చేస్తున్నారు.
ఇక ఇప్పటికే తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం తో ప్రస్తుతం మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలను టచ్ చేసే వారు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు మన హీరోలు బాలీవుడ్ ఇండస్ట్రీ ని పూర్తి గా ఆక్యు పై చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది…